90ఎంఎల్ రివ్యూ.. కిక్ ఏ మేరకు ఎక్కిందంటే..!
సినిమా:90ఎంఎల్ దర్శకత్వం: శేఖర్ రెడ్డి యర్ర నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవి కిషన్, రావు రమేష్, సత్యప్రకాష్, ప్రగతి, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: యువరాజ్ ఎడిటింగ్: ఎస్‌ఆర్ శేఖర్ ‘ఆర్ఎక్స్ 100’ వంటి సెన్సేషనల్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. ఆ తరువాత ‘హిప్పీ’, ‘గుణ 369’తో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ మధ్యలోనే నాని ‘గ్యాంగ్‌లీడర్’ కోసం విలన్‌గా మారి మంచి మార్కులే కొట్టేశాడు. […]
సినిమా:90ఎంఎల్ దర్శకత్వం: శేఖర్ రెడ్డి యర్ర నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవి కిషన్, రావు రమేష్, సత్యప్రకాష్, ప్రగతి, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: యువరాజ్ ఎడిటింగ్: ఎస్‌ఆర్ శేఖర్
‘ఆర్ఎక్స్ 100’ వంటి సెన్సేషనల్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. ఆ తరువాత ‘హిప్పీ’, ‘గుణ 369’తో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ మధ్యలోనే నాని ‘గ్యాంగ్‌లీడర్’ కోసం విలన్‌గా మారి మంచి మార్కులే కొట్టేశాడు. ఇక ఇప్పుడు’90ఎమ్‌ఎల్’లో నటించాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం నడిచినప్పటికీ.. సెన్సార్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.? ప్రేక్షకులకు 90ఎంఎల్ కిక్కు ఏ మేరకు ఎక్కింది..? అన్నది తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ: దేవదాసుకు (కార్తికేయ) ఒక అరుదైన జబ్బు ఉంటుంది. అదేంటంటే ఒక్కపూట తాగకపోయిన అతడు చచ్చిపోతాడు. దాంతో తల్లిదండ్రులు దేవదాసుకు మందు అలవాటు చేస్తారు. ఈ క్రమంలో అసలు మందు వాసన కూడా పడని సువాసన(నేహా సోలంకి) ప్రేమలో పడతాడు. సువాసన కూడా దేవదాసును ఇష్టపడుతుంది. కానీ దేవదాసు వింత జబ్బు ఉందని తెలియని సువాసన.. అతడు ఒక్కరోజు కూడా తాగకుండా ఉండటాన్ని చూసి ద్వేషించడం మొదలుపెడుతుంది. అదే సమయంలో జాన్ విక్(రవి కిషన్) అనే వ్యాపారవేత్త సువాసనను ప్రేమిస్తానని వస్తాడు. మరి దేవదాసు ఏం చేశాడు..? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు..? అన్నది మిగిలిన కథ.
కథనం: ‘భలే భలే మగాడివోయ్’, ‘రంగస్థలం’, ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్ చిత్రాల్లో హీరోలకు డిసీజ్‌లు ఉంటాయి. ఈ సినిమాలు హిట్ అవ్వడంతో.. మిగిలిన హీరోలు కూడా లోపం ఉండే కారెక్టర్ కథల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ ఈ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హీరో మందు తాగకపోతే చచ్చిపోవడం అనే కొత్త పాయింట్‌ను దర్శకుడు తీసుకున్నప్పటకీ.. కథనంలో మాత్రం రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు దర్శకుడు. ఇక విలన్ కారెక్టర్‌ను ఏమనుకొని డిజైన్ చేశాడో అస్సలు అర్థం కాదు. ఇక దేవదాసుతో మందు మానిపించే సన్నివేశంలో ఏం చెప్తున్నాడో దర్శకుడు తికమక పడ్డాడు. ఇక ఫస్టాఫ్ కాస్త పర్వాలేదనిపించినా.. సెకండాఫ్ మాత్రం బాగా సాగదీశాడు దర్శకుడు.
నటీనటులు: దేవదాసు పాత్రలో కార్తికేయ బాగా నటించాడు. సరదా సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లతో మెప్పించాడు. హీరోయిన్ నేహా సోలంకి అందాలు ఆరబోసినప్పటికీ.. కథలో పెద్దగా ఇమడలేకపోయింది. అందంగా ఉన్నా, అభినయం అంతగా చూపించలేకపోయింది. రవికిషన్ కూడా విలన్ పాత్రకు న్యాయం చేశాడు. వీరితో పాటు రావు రమేష్, అజయ్, రఘు, ప్రగతి, సత్యప్రకాష్ తదితరులు తమ పాత్రల మేర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం: ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన పాటలలో సింగిల్ సింగిల్ మినహా.. మిగిలిన పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సినిమాకు మైనస్‌లలో ఎడిటింగ్ ఒకటి అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక కొత్త పాయింట్‌ను తీసుకున్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడంతో ప్రేక్షకులను అనుకున్నంతమేర మెప్పించలేకపోయాడు.
ఫైనల్‌గా: ప్రేక్షకులకు అంతగా ఎక్కని 90ఎంఎల్ కిక్కు