టాలీవుడ్‏లో మరో మల్టీస్టారర్ మూవీ ? పెద్ద హిట్టు కొట్టేందుకు ప్లాన్ చేస్తున్న యంగ్ హీరోలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్

టాలీవుడ్‏లో మరో మల్టీస్టారర్ మూవీ ? పెద్ద హిట్టు కొట్టేందుకు ప్లాన్ చేస్తున్న యంగ్ హీరోలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 30, 2021 | 12:12 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఇద్దరు యంగ్ హీరోలు మల్టీస్టారర్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి.. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు కార్తికేయ. అలాగే ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ విభిన్న కథాంశంతో హీరోగా పరిచయమైన విశ్వక్ సేన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఈ ఇద్దరు సక్సెస్ హీరోలు ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్న ఈ హీరోలు.. ఇప్పుడు సంయుక్తంగా ఓ భారీ విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారట. ఇక ఆ సినిమాకు నూతన దర్శకుడు డైరెక్షన్ చేయనున్నట్లుగా సమాచారం. మరీ నిజంగానే ఈ ఇద్దరు హీరోలు ఓకే ఫ్రేములో కనిపిస్తారా ?లేదా? అనేది చూడాలి మరి.

Also Read:

Mahasamudram Movie : కొలవలేనంత ప్రేమను పంచడానికి వచ్చేస్తున్నారు.. ‘మహాసముద్రం’ రిలీజ్ డేట్