Hero Vikram Son Druv: కబడ్డీ ప్లేయర్‌గా మారిన హీరో విక్రమ్ తనయుడు.. అసలు విషయం ఎంటంటే ?
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తమిళ రీమెక్ 'వర్మ'తో హీరోగా పరిచయమయ్యాడు హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తాజాగా ధ్రువ్ మరో సినిమాకు ఓకే
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తమిళ రీమెక్ ‘వర్మ’తో హీరోగా పరిచయమయ్యాడు హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తాజాగా ధ్రువ్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ఇందులో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారుడిగా ఎదిగి.. చివరకు దేశం అత్యున్నత క్రీడా గౌరవాన్ని గెలుచుకోనున్న ఓ క్రీడాకారుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆసియా క్రీడలతో భారత దేశానికి గోల్డ్ మేడల్ సాధించిన కబడ్డీ ఆటగాడి నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు పా.రంజిత్ నిర్మాణ సంస్థ అయిన నీలం ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతుంది.
Also Read:
ఎవరు మా ఇంటికి రావొద్దు.. ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో.. అసలు కారణం ఎంటంటే ?