
తమిళనాడుకు కావేరీ జలాలు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటకలో చేపట్టిన బంద్ ప్రభావం ఆ రాష్ట్రంలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఇవాళ 44 విమానాలు క్యాన్సల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.. కర్నాటక బంద్‌లో భాగంగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లోకి కొందరు కన్నడ అనుకూల కార్యకర్తలు చొచ్చుకువచ్చారు..నీటి తరలింపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..అక్కడే ఉన్న పోలీసులు అయిదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కావేరి జలాలు కోసం పోరాటం చేస్తున్నన కన్నడిగులు ఇవాళ కర్నాటక బంద్‌కు పిలుపునిచ్చారు..ఈ బంద్‌కు బెంగళూరు ప్రజలు ఊహించని మద్దతు తెలుపుతున్నారు. రక్తం అయినా ఇస్తాము కాని తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇవ్వలేమనే నినాదాలతో కర్నాటక దద్దరిల్లుతుంది. కావేరి జలాల కోసం ఎంతవరకు అయినా పోరాటం చేస్తామంటున్నారు కన్నడిగులు.. బెంగళూరులో తక్కువ సంఖ్యలో బస్సులు రోడ్ల మీదకు వచ్చాయి..అయితే ప్రయాణికులు లేకపోవడంతో ఖాళీగా తిరుగుతున్నాయి. నగరంలో మాల్స్, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు పూర్తిగా మూసివేశారు. హోటల్స్, టిఫిన్ సెంటర్లు, బేకరీలు పూర్తిగా మూసివేశారు..అటు 44 విమాన సర్వీలు పూర్తిగా నిలిచిపోవడంతో బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్డు రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. నమ్మ బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణికులు అంతంతమాత్రంగానే దర్శనం ఇచ్చారు..బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసిన పోలీసులు దర్శనం ఇస్తున్నారు.
కాగా కర్ణాటక బంద్‌కు శాండల్‌వుడ్ కూడా మద్దతు తెలిపింది . ఈరోజు (సెప్టెంబర్ 29) సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. సినిమా ప్రదర్శన, షూటింగ్‌లు జరగడం లేదు. బెంగళూరులోని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ సమీపంలోని గురురాజ్ కల్యాణ మండపం వద్ద సినీ పరిశ్రమ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నిరసనలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కళాకారులు పాల్గొంటున్నారు. ఉపేంద్ర, శివరాజ్‌కుమార్, సృజన్ లోకేష్ , గిరిజా లోకేష్, ఉమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ.. ‘కావేరి సమస్య మొదటి నుంచి ఉంది. పోరాడుతూనే ఉన్నాం. ఈ విషయంపై ప్రభుత్వాలు మాట్లాడాలి. రాజీ కుదుర్చుకోవాలి. రైతులు అన్ని చోట్లా ఒకేలా ఉన్నారు. అందరూ మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సుపై రాయి వేస్తే నిరసనగా ఉంటుందా? పోట్లాడుకుంటూ కూర్చుంటే పరిష్కారం దొరకదు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలిపారు శివన్న. ‘ నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. కర్ణాటక ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఎంతో గౌరవంగా ఉంటారు. ‘దయచేసి ఇలా జరిగినందుకు క్షమించండి’ అని కోరారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.