AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karate Kalyani: అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు..

దాదాపు ఇరవైకి పైగా యూట్యూబ్ ఛానెళ్లపై కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు.

Karate Kalyani: అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు..
Kalyani
Rajitha Chanti
|

Updated on: May 27, 2022 | 2:06 PM

Share

మహిళలతో అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై సీసీఎస్ లో ఫిర్యాదు చేసింది సినీ నటి కరాటే కళ్యాణి.. దాదాపు ఇరవైకి పైగా యూట్యూబ్ ఛానెళ్లపై కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు.. గత కొద్ది రోజుల క్రితం యూట్యూబర్ శ్రీకాంత్ పై కరాటే కళ్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. దారుణమైన వీడియోలు చేస్తున్నాడని అతని చెంప పగలకొట్టింది కళ్యాణి. నువ్వు తీస్తున్న వీడియోలతో సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్‌ అంటూ అతనిపై ఫైర్ అయ్యింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి సైతం రివర్స్ అటాక్ చేశాడు.. తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి సైతం చెంప పగలకొట్టాడు.. ఆ తర్వాత చుట్టూ ఉన్నవాళ్లు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయగా.. వీరిద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు.

ప్రాంక్‌ల పేరుతో మహిళలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడని…ఎక్కడ బడితే అక్కడ చేతులేస్తూ.. అడల్ట్ కంటెంట్ వీడియోలతో పబ్బం గడుపుకుంటున్నాడని..అతని యూట్యూబ్‌ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది కళ్యాణి.. అయితే తన వీడియోలపై అభ్యంతరం ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌ రెడ్డి ఎదురుతిరిగాడు. ఆ తర్వాత కరాటే కళ్యాణి ఓ బాబును అక్రమంగా పెంచుకుంటున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. ఆ తర్వాత రోజు కళ్యాణి ప్రెస్ మీట్ పెట్టి చిన్నారి తల్లిదండ్రుల ఇష్టంతోనే తాను పాపను పెంచుకుంటున్నట్టు తెలిపారు. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు కళ్యాణి ఫ్రాంక్ వీడియోల యూట్యూబర్స్ పై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.