AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : అభిజీత్ ఇచ్చిన ఛాలెంజ్‌‌‌‌ను స్వీకరించి మొక్కలు నాటిన నటి కరాటే కళ్యాణి..

రాజ్యససభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా సాగుతుంది. పలువురు సెలబ్రెటీలతోపాటు...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : అభిజీత్ ఇచ్చిన ఛాలెంజ్‌‌‌‌ను స్వీకరించి మొక్కలు నాటిన నటి కరాటే కళ్యాణి..
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2020 | 8:50 PM

Share

రాజ్యససభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా సాగుతుంది. పలువురు సెలబ్రెటీలతోపాటు సామాన్యులుకూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని మునుకు తీసుకువెళ్తున్నారు. బిగ్ బాస్ షో 4 విజేత అభిజీత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు నటి కరాటే కళ్యాణి. తన కుమారుడి తో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు కళ్యాణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందని వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ వారు మొక్కలు నాటించే మంచి కార్యక్రమాన్ని నాతో చేపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మొక్కలంటే నాకు చాలా ఇష్టం ఏను ఎక్కువగా మొక్కలు పెంచుతాను అని తెలిపారు. ప్రజలందరిలో అవగాహన పెరిగేలా ఎవరికి వారు బాధ్యతగా మొక్కలు పెంచాలని కోరారు. ప్రముఖ నటి విజయశాంతి, డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాట‌మ‌ని కోరారు.

Follow Us