‘అమ్మ’గా క్వీన్

‘అమ్మ’గా క్వీన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాలలో ‘తలైవి’ ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జయలలితగా బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ కన్ఫర్మ్ అయింది. కంగనా పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నాడు. ఈ విషయం గురించి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 10:32 AM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాలలో ‘తలైవి’ ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జయలలితగా బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ కన్ఫర్మ్ అయింది. కంగనా పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నాడు.

ఈ విషయం గురించి విజయ్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. ఆమె జీవితాన్ని తెరకెక్కిస్తున్నామంటే మాపై ఎంతో బాధ్యత ఉంది. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. కంగనా రనౌత్ ఇందులో నటించడం ఆనందంగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు. కాగా మహిళా దర్శకురాలు ప్రియదర్శిని కూడా జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘ది ఐరన్ లేడి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అమ్మ పాత్రలో నిత్యామీనన్ కనిపించనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu