AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండు గీయించుకొని ఎక్కడికైనా అదృశ్యం కావాలనిపించేది: కంగనా

బాలీవుడ్‌లోని లొసుగులపై కంగనా రనౌత్‌ మరోసారి రెచ్చిపోయారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా సుశాంత్‌ ఆత్మహత్య కేసు, నెపోటిజం, తదితర అంశాలపై మాట్లాడారు.

గుండు గీయించుకొని ఎక్కడికైనా అదృశ్యం కావాలనిపించేది: కంగనా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2020 | 5:05 PM

Share

బాలీవుడ్‌లోని లొసుగులపై కంగనా రనౌత్‌ మరోసారి రెచ్చిపోయారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా సుశాంత్‌ ఆత్మహత్య కేసు, నెపోటిజం, తదితర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఓ విషయాన్ని ఆమె బయటపెట్టారు.

”2016లో నేను నటించిన ఒక చిత్రం మంచి హిట్ అయిన తరువాత 18 బ్రాండ్లకు అంబాసిడర్‌గా సంతకం చేశా. అయితే 2013లో నా నుంచి విడిపోయిన వ్యక్తి నా మీద కేసు నమోదు చేశాడు. దీన్ని సాకుగా చూపిస్తూ ఆ బ్రాండ్ల నుంచి నన్ను తొలగించారు. అంతేకాదు మంత్ర గత్తె, మనుషులను చంపుకు తినేది అంటూ నన్ను అభివర్ణించారు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన కూడా నాలో చచ్చిపోయింది. బ్రాండ్ల నుంచి నన్ను తీసేసిన తరువాత చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు చచ్చిపోవాలన్న ఆలోచన కూడా ఉండేది. గుండు గీయించుకొని ఎక్కడికైనా అదృశ్యం కావాలి అని భావించేదాన్ని. నా దగ్గరకు మా బంధువులు తమ పిల్లల్ని కూడా రానించే వారు కాదు” అని కంగనా వివరించారు.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!