కంగనా మరీ అంత టర్నింగ్ ఇచ్చుకోకు

ఆత్మవిశ్వాసం అవసరమే అయినా అది హద్దులు దాటితే ఎలా ఉంటుందో కంగనాని చూస్తే తెలుస్తుందంటున్నారు బాలీవుడ్‌ జనాలు. ‘మణికర్ణిక’ సినిమాలో కొన్ని సీన్లు షూట్‌ చేయడంతో కంగన తనో పెద్ద దర్శకురాలైపోయినట్లు తెగ ఫోజు కొడుతోందట. ఆ క్రమంలోనే త్వరలో తాను దర్శకత్వం చేయబోయే సినిమా… బాహుబలి, పద్మావతిని మించి ఉంటుందని గొప్పలు పోతోంది. ఆ రెండు సినిమాలు ఎంత విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటి విజయం వెనుక దర్శకుల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి […]

కంగనా మరీ అంత టర్నింగ్ ఇచ్చుకోకు

ఆత్మవిశ్వాసం అవసరమే అయినా అది హద్దులు దాటితే ఎలా ఉంటుందో కంగనాని చూస్తే తెలుస్తుందంటున్నారు బాలీవుడ్‌ జనాలు. ‘మణికర్ణిక’ సినిమాలో కొన్ని సీన్లు షూట్‌ చేయడంతో కంగన తనో పెద్ద దర్శకురాలైపోయినట్లు తెగ ఫోజు కొడుతోందట. ఆ క్రమంలోనే త్వరలో తాను దర్శకత్వం చేయబోయే సినిమా… బాహుబలి, పద్మావతిని మించి ఉంటుందని గొప్పలు పోతోంది. ఆ రెండు సినిమాలు ఎంత విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటి విజయం వెనుక దర్శకుల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి దర్శకులతో తనని తాను పోల్చుకోవడమే కాదు. వారిని తక్కువ చేసి మాట్లాడుతున్న కంగనాపై సినీ అభిమానులు గుర్రుగా ఉన్నారట. మొత్తానికి కంగనా మాటలు కోటలు దాటుతున్నాయనీ, ఇప్పటికైనా వాటిని మానుకోకపోతే ముప్పు తప్పదని కొందరు హెచ్చరిస్తున్నారు.