Vikram Collections: విక్రమ్ కలెక్షన్స్ రికార్డులు.. చిరంజీవి, రజనీకాంత్‌కు కొత్త జోష్..

Kamal Hassan's Vikram Movie: విక్రమ్ సినిమా రూ.300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. 15 ఏళ్లుగా సరైన హిట్ లేని కమల్ హాసన్‌ను చూసి హిట్ కొడితే చాలు అనుకున్నారు అభిమానులు.

Vikram Collections: విక్రమ్ కలెక్షన్స్ రికార్డులు.. చిరంజీవి, రజనీకాంత్‌కు కొత్త జోష్..

Edited By:

Updated on: Jun 15, 2022 | 9:10 PM

Vikram Movie Collections: కమల్ లేటెస్ట్ మూవీ విక్రమ్ సినిమా విజయం చాలా మంది హీరోలకు బూస్టప్ ఇచ్చింది. కెరీర్ అయిపోయిందనుకుంటున్న సమయంలో రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చారు కమల్ హాసన్(Kamal Haasan). ఈయన్ని చూసి ఇప్పుడు మిగిలిన సీనియర్ హీరోలకు, వారి ఫ్యాన్స్‌కు నమ్మకం పెరిగిపోయింది. వయసుతో పనిలేదు.. కంటెంట్ కరెక్టుగా పడితే రికార్డ్స్ నడుచుకుంటూ వస్తాయంటున్నారు. మరి అలాంటి బ్లాక్‌బస్టర్స్ కోసం చూస్తున్న సీనియర్స్ ఎవరు..? వాళ్లు చేస్తున్న సినిమాలేంటి..?

విక్రమ్ సినిమా రూ.300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. 15 ఏళ్లుగా సరైన హిట్ లేని కమల్ హాసన్‌ను చూసి హిట్ కొడితే చాలు అనుకున్నారు అభిమానులు. అసలు ఆ హిట్టైనా కొడతారా లేదా అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉండేవి. కానీ ఇలాంటి సమయంలో విక్రమ్ సినిమాతో కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తున్నారు కమల్. ఈ హిట్ జోష్ మిగిలిన సీనియర్స్‌లోనూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కమల్ సమకాలీకులైన చిరంజీవి, రజినీకాంత్ విక్రమ్ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

యంగ్ జనరేషన్ ఏకంగా రూ.1000 కోట్ల సినిమాలు ఇస్తున్నారు.. నిజం చెప్పాలంటే వాళ్ళతో కొన్నేళ్లుగా సీనియర్స్‌ పోటీ పడలేకపోతున్నారు. అప్పుడప్పుడూ హిట్స్ ఇస్తున్నారు కానీ మరీ కలెక్షన్ల రికార్డులు తిరగరాసేంత విజయాలు మాత్రం రావట్లేదు. ఒకప్పుడు చిరు, రజినీ, బాలయ్య, కమల్.. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. కానీ ఈ మధ్య అది తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో మొన్న బాలయ్య అఖండ.. తాజాగా కమల్ విక్రమ్‌తో కలెక్షన్ల రికార్డులు మొదలుపెట్టారు. దాంతో మిగిలిన సీనియర్లలో జోష్ పెరిగింది.

ఇవి కూడా చదవండి

Balakrishna in Akhanda Movie

చెప్పాలంటే రోబో తర్వాత సరైన విజయం కోసం వేచి చూస్తున్నారు రజినీకాంత్. ప్రస్తుతం ఈయన నెల్సన్‌తో సినిమా చేస్తున్నారు. ఇందులో జైలర్‌గా నటించనున్నారు సూపర్ స్టార్. జులై నుంచి షూటింగ్ మొదలు కానుంది. బీస్ట్ సినిమాతో నిరాశ పరిచిన నెల్సన్‌కు రజినీ ప్రాజెక్ట్ ప్రతిష్టాతకంగా మారింది. మరోవైపు చిరంజీవి కూడా వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చిన చిరు.. ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.

God Father

గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్స్ కావడంతో వాటికి చిరంజీవి కొత్తగా చేసేదేం లేదు. ఆయా కథలకు తన మెగా పవర్ జోడిస్తున్నారంతే. కానీ బాబీ తెరకెక్కిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో చిరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కొన్నేళ్లుగా తను మిస్సైన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో చూస్తున్నారు మెగాస్టార్. ఈ మూడు సినిమాలతో తానేంటో చూపిస్తానంటున్నారు అన్నయ్య. మరోవైపు రజినీకాంత్ కూడా కమ్ బ్యాక్ హిట్ కోసం చూస్తున్నారు. ఏదేమైనా విక్రమ్ విజయం చూసాక.. చిరంజీవి, రజినీ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు..

(ప్రవీణ్ కుమార్, టీవీ9 ET Team, హైదరాబాద్)

మరిన్ని సినిమా వార్తలు చదవండి..