తమిళ స్టార్ హీరో సరసన హలో బ్యూటీ

తమిళ స్టార్ హీరో సరసన హలో బ్యూటీ

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ చిత్రలహరి’, శర్వా-సుధీర్ వర్మల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించబోయే మల్టీ-స్టారర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ భామ దర్శకుడు పి.ఎస్ మిత్రన్ తెరకెక్కించే యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా శివ […]

TV9 Telugu Digital Desk

|

Feb 19, 2019 | 10:55 AM

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ చిత్రలహరి’, శర్వా-సుధీర్ వర్మల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించబోయే మల్టీ-స్టారర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ భామ దర్శకుడు పి.ఎస్ మిత్రన్ తెరకెక్కించే యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా శివ కార్తికేయన్ నటిస్తున్నాడు. డైరెక్టర్ ఇప్పటికే కళ్యాణి కి కథ వినిపించినట్లు వినికిడి. కళ్యాణి కూడా ఈ చిత్రంలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి కళ్యాణి ప్రియదర్శన్ కి ఈ సినిమా ఎలా కలిసొస్తుందో..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu