‘మహర్షి’లో ‘సీత’ను చూడాల్సిందే

కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా టాలీవుడ్‌లో ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది చందమామ కాజల్. తాజాగా ఆమె, తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే చిత్రంలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్, సోనూసూద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ల కోసం సూపర్‌స్టార్ మహేశ్ సాయం తీసుకుంటోంది కాజల్. మహేశ్ నటించిన ‘మహర్షి’ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీలో ‘సీత’ […]

‘మహర్షి’లో ‘సీత’ను చూడాల్సిందే
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

May 08, 2019 | 5:33 PM

కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా టాలీవుడ్‌లో ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది చందమామ కాజల్. తాజాగా ఆమె, తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే చిత్రంలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్, సోనూసూద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ల కోసం సూపర్‌స్టార్ మహేశ్ సాయం తీసుకుంటోంది కాజల్.

మహేశ్ నటించిన ‘మహర్షి’ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీలో ‘సీత’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కాజల్ వెల్లడించింది. మీ దగ్గర్లోని థియేటర్లలో మహర్షి మూవీలో సీత ట్రైలర్‌ను చూడండి అంటూ ఆమె పేర్కొంది. కాగా ఈ చిత్రంలో కాజల్ నెగిటివ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu