‘మహర్షి’ ఎఫెక్ట్: దిల్ రాజు ఆఫీసులో ఐటీ సోదాలు
మహేశ్ బాబు తాజా సినిమా ‘మహర్షి’కి సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీసులో వారు కీలక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆదాయం, ఖర్చులను చెక్ చేశారు. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమౌతుండగా.. దిల్ రాజు ఆఫీసులో ఐటీ దాడులు జరగడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. అయితే గతంలోనూ పలు భారీ చిత్రాల రిలీజ్ […]

మహేశ్ బాబు తాజా సినిమా ‘మహర్షి’కి సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీసులో వారు కీలక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆదాయం, ఖర్చులను చెక్ చేశారు. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమౌతుండగా.. దిల్ రాజు ఆఫీసులో ఐటీ దాడులు జరగడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. అయితే గతంలోనూ పలు భారీ చిత్రాల రిలీజ్ సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి.
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని థియేటర్లలో టికెట్ల రేట్లను పెంచాలంటూ మేకర్స్ కోర్టుకెక్కిన వైనం తెలిసిందే. ఇందుకు కోర్టు అనుమతించిందంటూ దిల్ రాజు తెలిపారు. అయితే ఈ వ్యవహారం సినిమా దర్శకనిర్మాతలకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం రేపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ల రేట్ల పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.