AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టికెట్ల ధరల పెంపుపై దిల్ రాజు క్లారిటీ

హైదరాబాద్‌: భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు సరైన వసూళ్లు సాధించాలంటే థియేటర్ యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచక తప్పడం లేదని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అభిప్రాయపడ్డారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘మహర్షి’. టాలీవుడ్ సూపర్ స్టార్  మహేశ్‌బాబు  కథానాయకుడిగాా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మే 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కాగా ప్రభుత్వం అనుమతితో ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు మంగళవారం హైదరాబాద్‌ థియేటర్‌ యాజమాన్యాలు వెల్లడించాయి. మరోపక్క […]

టికెట్ల ధరల పెంపుపై దిల్ రాజు క్లారిటీ
Ram Naramaneni
|

Updated on: May 08, 2019 | 5:25 PM

Share

హైదరాబాద్‌: భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు సరైన వసూళ్లు సాధించాలంటే థియేటర్ యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచక తప్పడం లేదని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అభిప్రాయపడ్డారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘మహర్షి’. టాలీవుడ్ సూపర్ స్టార్  మహేశ్‌బాబు  కథానాయకుడిగాా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మే 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కాగా ప్రభుత్వం అనుమతితో ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు మంగళవారం హైదరాబాద్‌ థియేటర్‌ యాజమాన్యాలు వెల్లడించాయి. మరోపక్క ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై తాజాగా దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం సినిమా అంటే నాలుగు రోజుల ముచ్చటే. ఆ నాలుగు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి రప్పించుకోవాల్సి వస్తోంది. కోర్టు ఉత్తర్వుల మేరకే తెలంగాణలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ థియేటర్ యాజమాన్యాలు ధరలు పెంచాయి. ‘బాహుబలి’ లాంటి చిత్రాలు విడుదలై 50 రోజులు కూడా ఆడని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ‘మహర్షి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల చేయబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Follow Us
ఈ ఒక్క డెబిట్ కార్డు ఉంటే రూ.20 లక్షలు ఫ్రీ..
ఈ ఒక్క డెబిట్ కార్డు ఉంటే రూ.20 లక్షలు ఫ్రీ..
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్