దుబాయి వెళ్లిన ఎన్టీఆర్

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న  మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్‌కు ఎన్టీఆర్ బ్రేక్ ఇచ్చాడు. రెండో షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో కలిసి కొన్ని  కీలక సన్నివేశాలలో నటించిన ఎన్టీఆర్.. తాజాగా బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో దుబాయి ట్రిప్‌కు వెళ్లాడు. భార్య ప్రణతి, కుమారుడు అభయ్ రామ్‌తో దుబాయికి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడే కొన్ని రోజులు ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం అతడు షాపింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చెర్రీ కోసం ఓ […]

దుబాయి వెళ్లిన ఎన్టీఆర్
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న  మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్‌కు ఎన్టీఆర్ బ్రేక్ ఇచ్చాడు. రెండో షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో కలిసి కొన్ని  కీలక సన్నివేశాలలో నటించిన ఎన్టీఆర్.. తాజాగా బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో దుబాయి ట్రిప్‌కు వెళ్లాడు. భార్య ప్రణతి, కుమారుడు అభయ్ రామ్‌తో దుబాయికి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడే కొన్ని రోజులు ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం అతడు షాపింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చెర్రీ కోసం ఓ భారీ ఫైట్‌ను ప్లాన్ చేసిన రాజమౌళి.. వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో ఆ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నాడు. ఇది సినిమా హైలెట్‌లలో ఒకటిగా నిలవనుందని టాక్. కాగా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published On - 3:55 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu