Hero NTR: కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఎన్టీఆర్.. సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్..

'అల వైకుంఠపురం' తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన తదుపరి సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలె

Hero NTR: కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఎన్టీఆర్.. సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2021 | 10:07 AM

‘అల వైకుంఠపురం’ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన తదుపరి సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలె జూనియర్ ఎన్టీఆర్‏ను న్యూఇయర్ రోజున కలవడంతో ఈ సినిమా మరింత క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ షూటింగ్ గురించి ఓ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాను వేసవిలో మే 20 నుంచి స్టార్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్‏కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారిగా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Payal Rajput : ఆ హీరోయిన్ గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్