AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జెర్సీ’ గాయాలు: అప్పుడు నానికి.. ఇప్పుడు షాహిద్‌కు

గతేడాది టాలీవుడ్‌లో వచ్చిన మంచి చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా లిస్ట్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలే కాదు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ రీమేక్‌కు గౌతమ్ తిన్ననూరి(తెలుగులోనూ ఆయనే దర్శకుడు) దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, గీతా ఆర్ట్స్, అమన్ గిల్ […]

'జెర్సీ' గాయాలు: అప్పుడు నానికి.. ఇప్పుడు షాహిద్‌కు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 12, 2020 | 9:32 PM

Share

గతేడాది టాలీవుడ్‌లో వచ్చిన మంచి చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా లిస్ట్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలే కాదు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ రీమేక్‌కు గౌతమ్ తిన్ననూరి(తెలుగులోనూ ఆయనే దర్శకుడు) దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, గీతా ఆర్ట్స్, అమన్ గిల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇక గతేడాది డిసెంబర్‌లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. చండీగఢ్‌లో చిత్రీకరణను చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం షాహిద్ క్రికెట్‌ సన్నివేశాన్ని సాధన చేస్తున్నప్పుడు అనుకోకుండా బంతి ఆయన మొహానికి తగిలింది. దీంతో కింద పెదవికి బలంగా దెబ్బ తగలడంతో.. 13 కుట్లు పడ్డాయి. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన షాహిద్.. ‘‘మీ సానుభూతికి ధన్యవాదాలు. నా పెదవికి కుట్లు పడ్డాయి. త్వరగా కోలుకుంటా. జెర్సీ నా రక్తంలో కొంత తీసుకుంది. ఇలాంటి స్క్రిప్ట్ కోసం అంత మాత్రమైనా చేయాలి’’ అని ట్వీట్ చేశారు. కాగా పెదవులకు కుట్లు పడటంతో సినిమా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చారు. దీంతో ముంబయికి తన భార్య మీరాతో కలిసి వెళ్లారు షాహిద్. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఫొటోలో ముఖానికి మాస్క్ వేసుకొని కనిపించారు ఈ హీరో. అయితే జెర్సీని తెలుగులో తెరకెక్కించే సమయంలో నాని గాయపడ్డారు. బంతి నాని ముక్కుకు బలంగా తగలడంతో ఆయన ముక్కు విరిగి పక్కకు వెళ్లింది. ఈ విషయాన్ని నాని కూడా ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు