AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతడిని వదల్లేకపోతున్న సుకుమార్.. ‘పుష్ప’లో కీలక పాత్ర‌!

లెక్కల మాస్టర్ సుకుమార్‌కి ఎవరైనా నచ్చారంటే చాలు వారిని అంత ఈజీగా వదులుకోరు. ఈ క్రమంలోనే సుకుమార్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి

అతడిని వదల్లేకపోతున్న సుకుమార్.. 'పుష్ప'లో కీలక పాత్ర‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 11:18 AM

Share

Allu Arjun Pushpa movie: లెక్కల మాస్టర్ సుకుమార్‌కి ఎవరైనా నచ్చారంటే చాలు వారిని అంత ఈజీగా వదులుకోరు. ఈ క్రమంలోనే సుకుమార్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన అన్నీ చిత్రాలకు రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తూ వస్తున్నారు. అలాగే‌ రత్నవేలు సైతం సుకుమార్‌ మెజారిటీ మూవీలకు సినిమాటోగ్రఫీ అందించారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు ఓ నటుడిని మాత్రం వదల్లేకపోతున్నారట. గతంలో ఆయన తెరకెక్కించిన రెండు మూవీల్లో ఆ నటుడు కీలక పాత్రల్లో నటించగా.. ఇప్పుడు అల్లు అర్జున్‌ ‘పుష్ప’ కోసం కూడా ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ నటుడెవరంటే.. జగపతి బాబు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న జగపతి బాబు.. సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో, రంగస్థలంలో నటించారు. ఈ రెండు చిత్రాల్లోనూ జగ్గు భాయ్ విలన్‌గా కనిపించగా, ప్రేక్షకులు ఆ పాత్రలను మరిచిపోలేని విధంగా డిజైన్ చేశారు సుకుమార్. ఇక తాజా సమాచారం ప్రకారం పుష్పలోనూ ఓ కీలక పాత్ర కోసం జగపతి బాబును సంప్రదించారట లెక్కల మాస్టర్‌. ఈ పాత్ర బాగా ఉండటం, సుక్కుపై నమ్మకంపై ఆయన వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా తెరకెక్కబోతున్న పుష్పపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

ఏపీలో ఆలయంకు సీఎం కేసీఆర్ విరాళం

పులివెందుల ఎస్సైని ఢీకొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్‌

Follow Us