AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ మూవీ… జగ్గూభాయ్ క్లారిటీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో ఓ కీలక పాత్రలో నటించడం కోసం జగపతిబాబును ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే కారణాలు ఏంటనేవి తెలియదు గానీ.. కొద్దిరోజులకు జగపతిబాబు ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ మూవీ కోసం ఆయన రెండు సినిమాలను సైతం వదులుకున్నాడు. సినిమా నుంచి […]

మహేష్ మూవీ... జగ్గూభాయ్ క్లారిటీ!
Ravi Kiran
|

Updated on: Jul 19, 2019 | 6:09 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో ఓ కీలక పాత్రలో నటించడం కోసం జగపతిబాబును ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే కారణాలు ఏంటనేవి తెలియదు గానీ.. కొద్దిరోజులకు జగపతిబాబు ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ మూవీ కోసం ఆయన రెండు సినిమాలను సైతం వదులుకున్నాడు.

సినిమా నుంచి జగ్గూభాయ్ తప్పుకోవడం వెనక పలు రూమర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇక తాజాగా దీనిపై జగపతిబాబు క్లారిటీ ఇచ్చాడు. కొన్ని అంతర్గత కారణాల వల్ల తప్పుకున్నానని.. మహేష్ బాబు, అనిల్ రావిపూడి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. జగ్గూభాయ్ డైరెక్ట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఈ రూమర్లకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.

Follow Us