Jackie Shroff: జ్యోతిష్యాన్ని అపహాస్యం చేయొద్దంటున్న జాకీ ష్రాఫ్‌.. సోదరుడి మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న స్టైలిష్‌ విలన్‌..

జ్యోతిష్యం, జాతకాలు, వాస్తు శాస్త్రాలపై ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు వాటిని విశ్వసిస్తే.. మరికొందరు అసలే పట్టించుకోరు. ఇంకొందరైతే అపహాస్యం చేస్తుంటారు.

Jackie Shroff: జ్యోతిష్యాన్ని అపహాస్యం చేయొద్దంటున్న జాకీ ష్రాఫ్‌.. సోదరుడి మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న స్టైలిష్‌ విలన్‌..

Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 7:05 PM

జ్యోతిష్యం, జాతకాలు, వాస్తు శాస్త్రాలపై ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు వాటిని విశ్వసిస్తే.. మరికొందరు అసలే పట్టించుకోరు. ఇంకొందరైతే అపహాస్యం చేస్తుంటారు. అయితే అలా చేయొద్దంటున్నాడు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌. 90వ దశకంలో హీరోగా బాలీవుడ్‌ను ఏలిన ఈ నటుడు ఇప్పుడు స్టైలిష్‌ విలన్‌గా మెప్పిస్తున్నాడు. ‘శక్తి’, ‘పంజా’, ‘సాహో’, ‘బిగిల్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు జాకీ. కాగా అక్షయ్‌ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జ్యోతిష్యంపై తనకున్న అభిప్రాయాలను వెల్లడించారు.

‘నాకు 10ఏళ్ల వయసు ఉండగా నా సోదరుడు మరణించాడు. ఆ సమయంలో అతడి వయసు కేవలం 17 ఏళ్లు. ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికి మా సోదరుడు మా మనసులు, ఫొటోల్లో సజీవంగా ఉన్నాడు. అయితే నా సోదరుడి మరణాన్ని మా నాన్న ముందే ఊహించి హెచ్చరించారు. కానీ దురదృష్టవశాత్తూ అతను నాన్న మాటలను విశ్వసించలేదు. నా సోదరుడు ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. ఆ రోజు బాగా లేదని మా నాన్న చెప్పారు. అందువల్ల ఇంటిని వదిలి ఎక్కడకు వెళ్లొద్దని అభ్యర్థించారు. కానీ, అతడు వినలేదు. సముద్రంలో పడిపోతున్న ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలోనే నా సోదరుడు కూడా చనిపోయాడు. చాలామంది జ్యోతిష్యాన్ని అపహాస్యం చేస్తుంటారు. కానీ మా నాన్న రెండుసార్లు ‌సార్లు కచ్చితంగా జరగబోయేది చెప్పారు. మొదటిది నా సోదరుడి మరణం గురించి ముందే అంచనా వేశారు. రెండోసారి నేను పెద్ద నటుణ్ని అవుతానని చెప్పారు. ఆయన అన్నట్లుగానే జరిగింది’ అని జాకీ ష్రాఫ్‌ తన జీవితంలోని చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకున్నారు.

Also Read: S.Thaman : ఈ సారి ప్రేమికుల రోజును ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుందాం.. తమన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..

Manchu Lakshmi: అందుకోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.. నెట్టింట్లో వైరల్‌గా మారిన మంచులక్ష్మి ట్వీట్‌..

Salman Khan: ఆస్పత్రిలో సల్లూభాయ్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో..