Breaking: కోలీవుడ్‌లో టెన్షన్.. విజయ్ ఇంట్లో మళ్లీ ఐటీ అధికారులు..!
తమిళ స్టార్ నటుడు విజయ్‌కు ఐటీ అధికారులు మళ్లీ షాకిచ్చారు. ఆయన ఇంట్లో దాడులు చేసి నెల రోజులు కూడా గడవకముందే మరోసారి విజయ్ ఇంటికి వెళ్లారు.
తమిళ స్టార్ నటుడు విజయ్‌కు ఐటీ అధికారులు మళ్లీ షాకిచ్చారు. ఆయన ఇంట్లో దాడులు చేసి నెల రోజులు కూడా గడవకముందే మరోసారి విజయ్ ఇంటికి వెళ్లారు. గురువారం చెన్నైలోని విజయ్ నివాసంలోకి ఐటీ అధికారులు వెళ్లారు. సోదాలతోపాటు విజయ్, ఆయన సతీమణి సంగీతను ఐటీ అధికారులు విచారించారు. కాగా విజిల్ సినిమాకు 50 కోట్లు, మాస్టర్ సినిమాకు 80 కోట్లు విజయ్ పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు సినిమాల పారితోషికం పన్ను చెల్లింపులపై విచారణ జరపామని ఐటీ శాఖ తెలిపింది.
అయితే విజయ్ ఇంటిపై, ఆఫీసుపై గత నెలలో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో ఆయన మాస్టర్ షూటింగ్‌లో ఉండగా.. అక్కడికే వెళ్లిన అధికారులు దాదాపు 12 గంటలకు పైగా విజయ్‌ను ప్రశ్నించారు. మరోవైపు విజయ్ ఇంట్లో, ఆఫీసులో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ వారి దాడిలో ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని తెలిసింది. దీంతో ఈ వివాదం అప్పుడే ముగిసిందని అందరూ భావించారు. అయితే మరోసారి విజయ్ ఆస్తులపై ఐటీ దాడులు జరగడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం మాస్టర్ అనే చిత్రంలో నటిస్తుండగా.. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read This Story Also: మిత్రుల నుంచి శత్రువులుగా మారిన హీరోలు.. కారణమిదే!