AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer S Janaki : మొన్న కొడుకు మృతి.. జానకమ్మ చివరి కోరిక అలాగే ఉండిపోయింది..

లెజెండరీ గాయని ఎస్. జానకి గారు కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం సాయంత్రం మైసూర్ లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితమే ఆమె తనయుడు గుండెపోటుతో మరణించారు. కొడుకు మృతితో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు.

Singer S Janaki : మొన్న కొడుకు మృతి.. జానకమ్మ చివరి కోరిక అలాగే ఉండిపోయింది..
S Janaki
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2026 | 9:29 PM

Share

లెజెండరీ గాయని ఎస్. జానకి గారి మృతితో సినీరంగంలో విషాదచాయలు అలుముకున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆమె కోడుకును కోల్పోయారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. మరోవైపు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. శనివారం సాయంత్రం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో తుదిశ్వాస విడిచారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్ జానకి గారు మాట్లాడుతూ… తన జీవితంలోని వివిధ కోణాలను, వ్యక్తిగత నమ్మకాలను, ఆధ్యాత్మిక అన్వేషణను, సంగీత ప్రపంచంపై తన లోతైన ఆలోచనలను పంచుకున్నారు. ఆమె కట్టు, బొట్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించగా, తన ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత రంగు చీరలు, జరీతో కూడిన వస్త్రాలు ధరించడం మానేసినట్లు తెలిపారు. అప్పటి నుండి కేవలం తెలుపు రంగు వస్త్రాలనే ధరిస్తున్నట్లు, సిల్క్ చీరలు కూడా కట్టడం లేదని చెప్పారు. అలాగే, గతంలో తాను పెద్ద బొట్టు పెట్టుకునేదాన్నని, దానికి ఒక విలువ ఉండేదని, అయితే ప్రస్తుతం బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని, తను లేనప్పుడు దానికి విలువ లేదని ఆమె భావిస్తున్నారని వివరించారు.

జానకి గారికి ఈ వయసులో ఉన్న కోరికల గురించి అడగగా, తనకు ఏ కోరికలు లేవని, నిండైన జీవితాన్ని చూశానని తెలిపారు. అయితే, “నేను ఎవరు?” అని తెలుసుకోవాలనే ఆకాంక్ష మాత్రమే తనకు మిగిలిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఇదేనని, మనం ఈ దేహం కాదని, మనలో ఉండే పరమాత్మను తెలుసుకోవాలని ఆమె తెలిపారు. ఈ దేహం ఒక కారణంతో వస్తుందని, కానీ నిజమైన మన అస్తిత్వం పరమాత్మలోనే ఉందని ఆమె విశ్వసించారు. ఈ జ్ఞానం లభిస్తే ఇంక జీవించాల్సిన అవసరం ఉండదని, అది తెలిసే వరకు ఈ దేహాన్ని కాపాడమని ప్రార్థించాలన్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రతి మనిషి తొందరపడాలని, మిగిలినవన్నీ తినడం, పడుకోవడం, పోవడం, మళ్ళీ రావడం వంటి రొటీన్ కార్యకలాపాలేనని ఆమె వివరించారు. ఆత్మ మళ్ళీ పుడుతుందని, ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాలంటే పరమాత్మ ఎవరని మనం తెలుసుకోవాలి అని ఆమె తన ఆధ్యాత్మిక చింతనను పంచుకున్నారు.

సంగీత ప్రస్థానం గురించి మాట్లాడుతూ, ఆమె తన మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. అభిమానులు ఆమెను సిరిమల్లె పువ్వ లా కనిపిస్తున్నారని ప్రశంసించగా, ఆ పాట తనకెంతో ప్రత్యేకమని తెలిపారు. సిరిమల్లె పువ్వ తమిళ్‌లో పాడినప్పుడు మొదటి జాతీయ అవార్డు వచ్చిందని, తర్వాత తెలుగులో తీసినప్పుడు చక్రవర్తి వేరే ట్యూన్ చేశారని చెప్పారు. అయితే, నిర్మాతలు సెంటిమెంట్‌గా అదే ట్యూన్‌ను కోరడంతో ఆ ట్యూన్‌నే తెలుగులో కూడా ఉంచారని ఆమె వివరించారు.

Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..