అమ్మ చేతి వంట తినేందుకు కేవలం 46 సంవత్సరాలు పట్టింది..!
అమ్మ చేతి వంట తినేందుకు తనకు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే పట్టిందని నటి, రచయిత, అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా అన్నారు. కరోనా లాక్‌డౌన్ వేళ సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకు పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ట్వింకిల్ ఖన్నా కోసం ఆమ తల్లి, నటి డింపుల్ కపాడియా ప్రైడ్ రైస్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్వింకిల్ ఖన్నా.. మా అమ్మ చేతి వంట తినడానికి […]

అమ్మ చేతి వంట తినేందుకు తనకు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే పట్టిందని నటి, రచయిత, అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా అన్నారు. కరోనా లాక్‌డౌన్ వేళ సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకు పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ట్వింకిల్ ఖన్నా కోసం ఆమ తల్లి, నటి డింపుల్ కపాడియా ప్రైడ్ రైస్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్వింకిల్ ఖన్నా.. మా అమ్మ చేతి వంట తినడానికి నాకు కేవలం 46 సంవత్సరాలు పట్టింది. విపత్కర పరిస్థితి రావడం లాక్‌డౌన్ కొనసాగించడంతో నా కోసం మొదటిసారిగా మా అమ్మ ఫ్రైడ్ రైస్ చేసింది. అందరూ అమ్మ చేతి వంట అంటుంటారు. ఆ అద్భుతాన్ని నేను ఇప్పుడు తెలుసుకున్నా. మామామియా అంటూ కామెంట్ పెట్టారు.
It has only taken 46 years, a pandemic and an extended lockdown for my mother to make me my first meal-fried rice:) Now I also know what people mean when they say ‘Maa Ke Haath Ka Khana’ #MamaMia pic.twitter.com/0KajtAmFru
— Twinkle Khanna (@mrsfunnybones) May 29, 2020
అయితే ట్వింకిల్ ఖన్నా ఎప్పుడూ సరదాగా ట్వీట్లు వేస్తుంటారు. ఆమె వేసే ట్వీట్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా అక్షయ్‌పై ట్వింకిల్ వేసే ట్వీట్లు వారి ఫ్యాన్స్‌ని బాగా నవ్విస్తుంటాయి. ఇక ఇటీవల కూడా ‘తాను నిర్మించే తదుపరి చిత్రంలో నిన్ను హీరోగా తీసుకోనంటూ’ అక్షయ్‌ని ఉద్దేశించి ట్వింకిల్ ట్వీట్ చేశారు. దానికి నటుడు అనిల్ కపూర్ స్పందిస్తూ.. ”మీ తదుపరి చిత్రంలో నన్ను, రాజ్‌కుమార్ రావును భాగం చేయండి” అంటూ కామెంట్ పెట్టారు. అందుకు ట్వింకిల్.. ‘మీ నటనకు నేను ముగ్ధురాలిని అయ్యాను’ అని స్పందించారు.
Read This Story Also: Covid 19: చైనా వ్యాక్సిన్ 99శాతం పనిచేస్తుందట..!
Wah! I am very impressed with the audition by these two newcomers, especially the one in the white shirt-And now I don’t even have to change the monogrammed masks we had bought for the main lead to use on the set 🙂 Big hug and stay safe @AnilKapoor https://t.co/rVrHzB2fGG
— Twinkle Khanna (@mrsfunnybones) May 29, 2020



