Covid 19: చైనా వ్యాక్సిన్ 99శాతం పనిచేస్తుందట..!

కరోనా వైరస్‌ని అంతమొందించేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్‌ను కూడా ప్రారంభించేశాయి. ఇదిలా  ఉంటే ఈ వైరస్‌కి పుట్టినిల్లు అయిన చైనా ఇప్పుడు ఓ వ్యాక్సిన్స్ తయారు చేసిందట. ఈ వ్యాక్సిన్ 99 శాతం పని చేస్తుందని చైనాకు చెందిన బయోఫార్మాసూటికల్ సంస్థ సినోవాక్ స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌కి కరోనావాక్‌గా పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ టీకాను ఇప్పటికే కోతులపై ప్రయోగించగా, […]

Covid 19: చైనా వ్యాక్సిన్ 99శాతం పనిచేస్తుందట..!
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 7:03 AM

కరోనా వైరస్‌ని అంతమొందించేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్‌ను కూడా ప్రారంభించేశాయి. ఇదిలా  ఉంటే ఈ వైరస్‌కి పుట్టినిల్లు అయిన చైనా ఇప్పుడు ఓ వ్యాక్సిన్స్ తయారు చేసిందట. ఈ వ్యాక్సిన్ 99 శాతం పని చేస్తుందని చైనాకు చెందిన బయోఫార్మాసూటికల్ సంస్థ సినోవాక్ స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌కి కరోనావాక్‌గా పేరు పెట్టినట్లు తెలిపింది.

ఈ టీకాను ఇప్పటికే కోతులపై ప్రయోగించగా, కరోనా కణాలను సమర్థవంతగా అడ్డుకుందని ఈ సంస్థ వెల్లడించింది. అంతేకాదు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు దశల పరీక్షలు పూర్తి అయినట్లు కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్ ట్రయల్ కోసం 1000 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇప్పుడు చైనాలో కేసులు తక్కువగా ఉండటం వలన వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలను యూకేలో చేపట్టబోతున్నట్లు సినోవాక్ వెల్లడించింది.

దీంతో పాటు పలు యూరప్‌ దేశాల్లోనూ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నామని సంస్థ పేర్కొంది. ఈ పరీక్షలు విజయవంతమైతే ఒకేసారి 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని సినోవాక్ తెలిపింది. కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికే ఈ టీకాను ముందుగా అందించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే వ్యాక్సిన్‌ వెంటనే వచ్చే అవకాశం లేదని సినోవాక్ స్పష్టం చేసింది.

Read This Story Also: గుడ్ న్యూస్.. కరోనా ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్​కు ఐసీఎంఆర్ ప‌ర్మిష‌న్..!