సీరియళ్ల షూటింగ్‌కి అనుమతిచ్చిన ప్రభుత్వం..!
లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా పలు రంగాలకు సడలింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కూడా సడలింపుల కోసం ఎదురుచూస్తోంది

లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా పలు రంగాలకు సడలింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కూడా సడలింపుల కోసం ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించింది. జూన్‌లో తెలంగాణలో మూవీ షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా అటు తమిళనాడులోనూ టీవీ సీరియళ్ల షూటింగ్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, బుల్లితెర నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి కుష్బూ ఇటీవల సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. చిత్రీకరణలో 20 మంది సభ్యులు ఉండాలని తెలిపింది. అయితే 20 మందితో షూటింగ్ సాధ్యం కాదని, కనీసం 60 మంది సభ్యులు ఉండాలని వారు కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు 60 మంది సభ్యులతో సీరియల్ షూటింగ్‌లు జరుపుకోవడానికి సీఎం నుంచి శనివారం అనుమతి లభించింది. అయితే షూటింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నిబంధనలు విధించారు. ఈ క్రమంలో ఆదివారం నుంచే సీరియళ్ల షూటింగ్‌లను నిర్వహించుకోవచ్చని సీఎం తెలిపారు.
Read This Story Also: అమ్మ చేతి వంట తినేందుకు కేవలం 46 సంవత్సరాలు పట్టింది..!



