Samantha: బంధం తెగినా.. అదే బాండింగ్.. అక్కినేని హీరోకు సామ్ విషెస్, ఇదిగో ఫ్రూఫ్!
టాలీవుడ్ నటి సమంత, నాగచైతన్యతో విడిపోయినప్పటికీ వీరిద్దరికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో నేటికి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే బ్రేకప్ విషయమై చైతూ సైలంట్ గా ఉంటున్నప్పటికీ, సమంత మాత్రం అప్పుడప్పుడు ఓపెన్ అవుతూనే ఉంటుంది. అయితే అక్కినేని ఫ్యామిలీ పట్ల నేటికి సమంత అదే ప్రేమను ప్రదర్శిస్తోంది.
టాలీవుడ్ నటి సమంత, నాగచైతన్యతో విడిపోయినప్పటికీ వీరిద్దరికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో నేటికి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే బ్రేకప్ విషయమై చైతూ సైలంట్ గా ఉంటున్నప్పటికీ, సమంత మాత్రం అప్పుడప్పుడు ఓపెన్ అవుతూనే ఉంటుంది. అయితే అక్కినేని ఫ్యామిలీ పట్ల నేటికి సమంత అదే ప్రేమను ప్రదర్శిస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా మాజీ మరిది అఖిల్ అక్కినేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అక్కినేని ఫ్యామిలీకి దూరమైనప్పటికీ సమంత అఖిల్ తో, అతని కుటుంబంతో మంచి బాండింగ్ కొనసాగిస్తోంది.
సామ్ పోస్ట్ లో అఖిల్ సోఫాలో హాయిగా కూర్చొని, ఒక పెంపుడు కుక్కతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నాడు. హ్యాపీ బర్త్ డే @akkineniakhil అంటూ సమంత విష్ చేసింది. ‘‘మీకు ఈ ఇయర్ అద్భుతంగా ఉండాలి. భగవంతుడు ఆశీర్వదిస్తాడు.” అంటూ రియాక్ట్ అయ్యింది. ఈ పోస్ట్ తో అక్కినేని ఫ్యామిలీతో ఉన్న సమంత బంధం ఎలాంటి అర్ధమవుతోంది. సమంత, నాగచైతన్య 2017లో పెళ్లి చేసుకున్నప్పటికీ 2021లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే అఖిల్ కు సమంత ఇచ్చిన బర్త్ డే మెసేజ్ చూస్తుంటే తన మాజీ భర్త కుటుంబం గురించి ఇప్పటికీ అదే కేరింగ్ ఉందని, అదే బాండింగ్ ఉందని అర్ధమవుతోంది.
అఖిల్ బర్త్ డేను సమంత సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా గ్రీటింగ్స్ తెలియజేస్తూ విష్ చేసింది. ఇక కెరీర్ విషయానికొస్తే అఖిల్ అక్కినేని చివరగా ‘ఏజెంట్’ చిత్రంలో కనిపించగా, వరుణ్ ధావన్ కథానాయకుడిగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘సిటాడెల్-హనీ బన్నీ’తో సమంత రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం సామ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.