Prabhas: ప్రతి సినిమాలోనూ వారు మస్ట్.. ఆ ఒక్క విషయంలో రాజీపడని ప్రభాస్
బాహుబలికి ముందు ప్రభాస్ ధ్యాసంతా కేవలం తెలుగు ఇండస్ట్రీపైనే ఉండేది.. కానీ బాహుబలి మూవీ తర్వాత రేంజ్ పూర్తిగా మారిపోయింది.. ఓన్లీ పాన్ ఇండియా అంటున్నారు ప్రభాస్.
Prabhas Movie Update: ఒంటి చేతి చప్పట్లతో చప్పుడు రాదు.. రెండో చేయి తోడుండాల్సిందే. ప్రభాస్ ఇదే చేస్తున్నారిప్పుడు. తన సినిమాల్లో స్టార్ పవర్ కోరుకుంటున్నారు. ప్రతీ సినిమాలోనూ స్టార్ హీరోయిన్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కొన్నేళ్లుగా ప్రభాస్ హీరోయిన్స్ సెలక్షన్ చాలా యూనిక్‌గా ఉంటోంది. తన పాన్ ఇండియా క్రేజ్‌కి బాలీవుడ్ పవర్ జత చేస్తున్నారు రెబల్ స్టార్. తాజాగా మరో బాలీవుడ్ భామతో ప్రభాస్ జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఎవరా బ్యూటీ.. ఏంటా సినిమా..?
బాహుబలికి ముందు ప్రభాస్ ధ్యాసంతా కేవలం తెలుగు ఇండస్ట్రీపైనే ఉండేది.. కానీ బాహుబలి మూవీ తర్వాత రేంజ్ పూర్తిగా మారిపోయింది.. ఓన్లీ పాన్ ఇండియా అంటున్నారు ప్రభాస్. దానికి తగ్గట్లుగానే ఒక్కో సినిమాను రూ.200 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో చేస్తున్నారు. ఈ ప్రయాణంలో సాహో, రాధే శ్యామ్ నిరాశ పరిచినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు ప్రభాస్. తాజాగా ఈయన కమిటైన సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, స్పిరిట్ సినిమాల బడ్జెట్ రూ.1200 కోట్లకు పైగానే ఉంది.
బడ్జెట్ విషయంలోనే కాదు.. క్యాస్టింగ్ దగ్గర కూడా ప్రభాస్ నో కాంప్రమైజ్ అంటున్నారు. ఈయన సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధా కపూర్‌తో సాహోలో జోడీ కట్టిన ప్రభాస్.. మొన్న రాధే శ్యామ్‌లో పూజా హెగ్డేతో రొమాన్స్ చేసారు. తాజాగా సలార్‌లో శృతి హాసన్.. ప్రాజెక్ట్ కేలో దీపిక పదుకొనే, దిశా పటానీ.. ఆదిపురుష్‌లో కృతి సనన్‌లతో జోడీ కడుతున్నారు. బాలీవుడ్‌లో వీళ్ళందరి ఇమేజ్ ప్రభాస్‌కు హెల్ప్ అవ్వడం ఖాయం.
తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ జోడీ కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న స్పిరిట్‌లో హీరోయిన్‌గా కరీనా కపూర్‌ను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ జోడీ అంతగా బాగోదనే టాక్ అప్పుడే సోషల్ మీడియాలో మొదలైంది. ఒకవేళ కరీనా కాకపోయినా కచ్చితంగా టాప్ బాలీవుడ్ భామవైపు సందీప్ వంగా అడుగులు పడనున్నాయి. మొత్తానికి తన సినిమాల్లో కేవలం స్టార్ హీరోయిన్స్‌కే ఎంట్రీ అంటున్నారు ప్రభాస్.
మరిన్ని సినిమా వార్తలు చదవండి