Naga Chaitanya Akkineni: ప్రమోషన్ కోసం ఫ్యామిలీని కూడా వదల్లేదు.. సూపర్ చైతూ..
జోష్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో చైతూ నటించిన చిత్రం థ్యాంక్యూ. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రావడానికి 13 ఏళ్ళు పట్టింది. మరోవైపు మనం తర్వాత విక్రమ్ కు కుమార్ దర్శకత్వంలో చై నటిస్తున్న సినిమా థ్యాంక్యూ.
Tollywood: ఈ రోజుల్లో సినిమాను ప్రమోట్ చేసుకునే విధానమే మారిపోయింది. ప్రాజెక్ట్ ఎలా ఉన్నా.. ప్రమోషన్ బాగుంటే ఆడియన్స్‌లో ఆసక్తి పుడుతుంది. ప్రస్తుతం థ్యాంక్యూ(Thank You )సినిమా కోసం నాగ చైతన్య సైతం ఇదే చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఇతర సినిమాలతో బిజీగా ఉన్న చై.. తాజాగా థ్యాంక్యూపై ఫోకస్ చేసారు. ఇందులో భాగంగానే కుటుంబాన్ని ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు అక్కినేని వారసుడు. సోషల్ మీడియా(Social media)లో ఇదే హాట్ టాపిక్ ఇప్పుడు. నాగ చైతన్య ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి బంగార్రాజుగా వచ్చిన చై.. త్వరలోనే ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పడానికి వచ్చేస్తున్నారు. విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. జోష్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో చైతూ నటించిన చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రావడానికి 13 ఏళ్ళు పట్టింది. మరోవైపు మనం తర్వాత విక్రమ్ కు కుమార్ దర్శకత్వంలో చై నటిస్తున్న సినిమా థ్యాంక్యూ.
10 రోజుల కింది వరకు థ్యాంక్యూ సినిమా ప్రమోషన్స్‌లో పెద్దగా జోరు కనిపించలేదు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అహసనం వ్యక్తం చేసారు కూడా. జులై 8 నుంచి విడుదల వాయిదా పడటం.. చైతూ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఏంటబ్బా ఇది అనుకున్నారు. కానీ కొన్ని రోజులుగా థ్యాంక్యూ ప్రమోషన్ పరుగులు పెడుతుంది. నాగ చైతన్య, రాశీ ఖన్నా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా థ్యాంక్యూ ప్రమోషన్ కోసం కుటుంబాన్ని వాడుకున్నారు అక్కినేని హీరో. తన జీవితంలో ముగ్గురు కీలకమైన వ్యక్తులకు థ్యాంక్యూ చెప్పాలని.. అమ్మా, నాన్నా, కుక్క ఫోటోలను పోస్ట్ చేసారు చైతూ. ముందుగా అమ్మ గురించి చెప్తూ నా వెంటే ఉంటూ.. ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్యూ అని తెలిపారు. ఇక నాగార్జునతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి.. స్నేహితుడిలా నాకు తోడున్నందుకు థ్యాంక్స్ నాన్న అని రాసుకొచ్చారు. ఇక తనను మనిషిగా ఉంచినందుకు.. ఎలా ప్రేమించాలో చూపించినందుకు థ్యాంక్యూ హాష్ అంటూ కుక్క ఫోటోను పోస్ట్ చేసారు. మొత్తానికి థ్యాంక్యూ సినిమాను ఇలా ప్రమోట్ చేసుకుంటున్నారు చైతూ.