సురేందర్ రెడ్డి మూవీ.. అఖిల్ పాత్రపై ఆసక్తికర వార్త!
అక్కినేని వారసుడు అఖిల్ ఐదో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో
Akhil- Surender Reddy movie: అక్కినేని వారసుడు అఖిల్ ఐదో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, ఐదో మూవీలో నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో అఖిల్ గూఢచారిగా కనిపించబోతున్నారట. స్టైలిష్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ కథను మొదట సురేందర్ రెడ్డి, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి వినిపించారట. అయితే కొన్ని కారణాల వలన రామ్ రిజెక్ట్ చేశారట. ఆ తరువాత మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ సలహా మేరకు అఖిల్‌కి చెప్పడం, ఈ కథ అక్కినేని వారసుడికి నచ్చడం జరిగిపోయాయని తెలుస్తోంది. కాగా ఈ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తుండగా.. మిగిలిన వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
అయితే మరోవైపు అఖిల్, ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జీ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
Read More:
వ్యాపారి కుటుంబంలో ‘కరోనా’ విషాదం.. 20 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి