AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju: కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాక్షన్ సినిమాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తో లెజెండరీ నటుడిగా ఎదిగారు. నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణం రాజు 2022 సెప్టెంబర్ 22న కన్నుమూశారు.

Krishnam Raju: కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు
Krishnam Raju Family
Basha Shek
|

Updated on: Apr 29, 2026 | 7:44 PM

Share

రెబల్ స్టార్ కృష్ణం రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్తూరులో జన్మించిన ఆయన 1966లో `చిలకా గోరింక` అనే చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన సినిమా కెరీర్ లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు కృష్ణంరాజు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటారు రెబల్ స్టార్. అలాగే రాజకీయాల్లోనూ రాణించారు. కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. ఇక కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఇదిలా ఉంటే కృష్ణం రాజు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. కృష్ణంరాజుకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం మీకు తెలిసిందే. మొదటి భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత శ్యామలా దేవిని కృష్ణంరాజు పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే.. డెలివరీ టైమ్‌లో డాక్టర్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆ బిడ్డ చనిపోయాడని కృష్ణంరాజు రెండో భార్య శ్యామలా దేవి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

నిజం చెప్పాలంటే కృష్ణంరాజు రెండో పెళ్లి కూడా బలవంతంగా జరిగిందట. మొదటి భార్య యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత… రెండో పెళ్లి చేసుకోమని కృష్ణంరాజు తండ్రి చాలా సార్లు అడిగాడట. కానీ కృష్ణంరాజు వినలేదు. కానీ కొడుక్కి ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్న ఆయన ఇంట్లో అన్నం తినకుండా మంకు పట్టు పట్టారట. తండ్రి బాధను చూడలేకపోయిన కృష్ణంరాజు.. తన దగ్గరి బంధువైన శ్యామలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నాడరు. ఇక శ్యామలా దేవి, కృష్ణంరాజుకి ముగ్గురు ఆడపిల్లలు. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వీరు వివిధ రంగాల్లో స్థిర పడిన సంగతి తెలిసిందే.

కృష్ణం రాజు పెద్ద కూతురు సాయి ప్రసీద నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె యూఎస్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్‌ కోర్స్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్‌తో తీసిన ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది. ఇక రెండో కూతురు సాయి ప్రకీర్తి ఆర్కిటెక్ట్. ఆమె ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి ఇంటర్న్ షిప్‌ కూడా చేసింది. అలాగే మూడో కూతురు ప్రదీప్తి సైకాలజీ చేసింది. ప్రస్తుతం సైకాలజీ డాక్టర్‌గా రాణిస్తోంది. ఇక కృష్ణంరాజు శ్యామలా దేవితో పాటు వీరి ఫ్యామిలీకి సంబంధించిన అన్ని బాగోగులు ప్రభాస్‌ చూసుకుంటున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us