Allu Arjun: కొత్త లుక్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! అదిరిపోయిందంటున్న అభిమానులు
సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోలు స్టైలిష్ లుక్‌లో కనిపించేందుకు లక్షలు, కోట్ల విలువైన యాక్సెసరీలు వాడతారు. బట్టల నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్నింటిపైనా శ్రద్ధ పెడతారు. వాటిలో ముఖ్యమైనవి ఔట్ఫిట్లు, షూలు, వాచీలు. ఎన్ని బట్టలు యాక్సెసరీస్ వేసుకున్నా.. హెయిర్ స్టైల్ క్లాస్, మాస్ లుక్ ..

సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోలు స్టైలిష్ లుక్‌లో కనిపించేందుకు లక్షలు, కోట్ల విలువైన యాక్సెసరీలు వాడతారు. బట్టల నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్నింటిపైనా శ్రద్ధ పెడతారు. వాటిలో ముఖ్యమైనవి ఔట్ఫిట్లు, షూలు, వాచీలు. ఎన్ని బట్టలు యాక్సెసరీస్ వేసుకున్నా.. హెయిర్ స్టైల్ క్లాస్, మాస్ లుక్ డిసైడ్ చేస్తుంది. సినిమాల్లో కనిపించే లుక్ కోసం నేడు హీరోలు రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు.
సినిమా సినిమాకూ కొత్త హెయిర్ స్టైల్‌తో అభిమానులను అలరించేస్తుంటారు స్టార్ హీరోలు. వారిలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించడానికి ప్రయత్నిస్తారు. పుష్ప సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన బన్నీ.. ఇప్పుడు అట్లీ సినిమా(AA22)తో మరోసారి విభిన్నమైన కథతో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం కొత్త హోయిర్ స్టైల్ ట్రై చేస్తున్నారని సమాచారం. అందుకు తగినట్టుగానే ఇటీవల ఆయన ఎయిర్‌పోర్ట్‌లో కొత్త హెయిర్‌స్టైల్ అండ్ కలర్‌తో కనిపించారు.
LATEST 🚨: @alluarjun arrives at HYD airport we are back PEAK STYLISH STAR days #AA22 💥🥵#AlluArjun pic.twitter.com/8KecT72Vmk
— A R J U N_Online🗡️ (@Arjunu_666) December 1, 2025
ప్రస్తుతం అందరి దృష్టి ఆయన హెయిర్ స్టైల్ అండ్ కలర్ మీద పడింది. తాజాగా ఆయన పెట్టుకున్న వాచ్ గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధరించిన వాచీ ధర చూసి అందరూ షాకయ్యారు. ఇంతకీ ఆ వాచీ ధర ఎంత? ఎందుకు అభిమానులు షాకవుతున్నారనే విషయాలు వైరల్ అయ్యాయి.
స్పెషల్ ఏంటి..?
ఇండియన్ సినీఇండస్ట్రీలోని స్టైల్ ఐకాన్లలో ఒకరు అల్లు అర్జున్. బన్నీ ఫ్యాషన్ సెన్స్ చూస్తే ఎవరైనా ఆకర్షితులవుతారు. కానీ, ఇటీవల బన్నీ చేసిన ఒక చిన్న పని మాత్రం ప్రపంచవ్యాప్తంగా మిలియనేయర్లను కూడా తమ స్టైల్‌ను ప్రశ్నించుకునేలా చేస్తోంది. అదేంటంటే… ఇటీవల అల్లు అర్జున్ చేతికి మెరిసిన వాచ్ ధర కేవలం రూ.5,295 మాత్రమే! ఈ బడ్జెట్లో వాచ్ ఎంచుకోవడం బన్నీ హంబుల్‌నెస్, సింప్లీసిటీని తెలియజేస్తోంది.
అల్లు అర్జున్‌కు గ్లోబల్ లగ్జరీ బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే లగ్జరీనే కాదు సింపుల్, బ్యూటిఫుల్‌గా మేడ్ వాచ్ కూడా మన టేస్ట్, వాల్యూస్, కాన్ఫిడెన్స్‌ను చెప్పగలదనే విషయాన్ని చెప్పేందుకు బన్నీ ఈ వాచీని ఎంచుకున్నాడు. ట్రూ స్టైల్ అంటే మీరు కొనగలిగినది కాదు, మీరు ఎంచుకున్నది’ అనే విషయాన్ని బన్నీ మరోసారి ఫ్రూవ్ చేశాడని సంబరపడిపోతున్నారు అభిమానులు!




