మాజీ భర్త, పిల్లలముందే నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్
ఇటీవల కాలంలో పెళ్లి అంటే ఆటలు అయిపోయింది. ప్రేమలో పడటం , సహజీవనం, పెళ్లి , ఆ తర్వాత విడిపోవడం, మరో పిల్ల చేసుకోవడం.. నిత్యం ఇలాటి వార్తలే మనకు కనిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో పెళ్లి అంటే ఆటలు అయిపోయింది. ప్రేమలో పడటం , సహజీవనం, పెళ్లి , ఆ తర్వాత విడిపోవడం, మరో పిల్ల చేసుకోవడం.. నిత్యం ఇలాటి వార్తలే మనకు కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా తరాల విషయంలో ఇలాంటివి బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఊహించని ఊహించని విధంగా తమ వివాహబంధానికి స్వస్తి చెప్పి షాక్ ఇస్తున్నారు కొందరు సినిమా తారలు. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా నాలుగో పెళ్లిని చేసుకొని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఫ్యాన్స్ కు.. తన పిల్లల ఎదుటే నాలుగో పెళ్లి చేసుకుంది ఓ హీరోయిన్. ఇప్పుడు ఈవార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పైగా ఈ అమ్మడు పెళ్లాడిన వ్యక్తికి కూడా అది మొదటిదేమీ కాదు. అతనికి రెండో పెళ్లి.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..
జెన్నిఫర్ లోపెజ్ ఈ అందాల నటి గురించి తెలియని వారు ఉండరేమో.. తాజాగా ఈ అమ్మడు హీరో బెన్ అఫ్లెక్ పెళ్లాడింది. వీరివివాహం జార్జియాలోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. అలాగే వరుడు బెన్ అఫ్లెక్ మొదటి భార్య జెన్నిఫర్ గార్నర్ ఆమె ముగ్గరు పిల్లలు కూడా హాజరయ్యారు. అదేవిధంగా జెన్నిఫర్ లోపెజ్ మాజీ భర్త అతని పిల్లలు కూడా ఈ వివాహానికి హాజరవడం విశేషం. జెన్నిఫర్ కు ఇది నాలుగో వివాహం. ఓజానీ నోవాను 1997లో, 2001లో క్రిస్ జుడ్‌ని,2004లో సింగర్ మార్క్ ఆంటోనీని పెళ్లాడింది. ఇప్పుడు బెన్ అఫ్లెక్‌ను వివాహం చేసుకుంది.