Lisa Banes: ‘గాన్ గర్ల్’ మూవీ నటికి రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయలతో ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమం..

Lisa Banes: హాలీవుడ్ నటి లీసా బెన్స్ (65) రోడ్డు ప్రమాదానికి గురైంది. వాషింగ్టన్‏‏లోని లింకన్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన బైక్ ఆమె ఢీకొట్టిందని...

Lisa Banes: గాన్ గర్ల్ మూవీ నటికి రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయలతో ఐసీయూలో చికిత్స.. పరిస్థితి విషమం..
Lisa Banes

Updated on: Jun 08, 2021 | 12:16 PM

Lisa Banes: హాలీవుడ్ నటి లీసా బెన్స్ (65) రోడ్డు ప్రమాదానికి గురైంది. వాషింగ్టన్‏‏లోని లింకన్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన బైక్ ఆమె ఢీకొట్టిందని… ఆమె మేనేజర్ శనివారం తెలిపారు. దీంతో నటి లీసా బెన్స్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. Gone Girl Movie

శుక్రవారం సాయంత్రం లింకన్ సెంటర్ సమీపంలో మాన్హాటన్ ఎగువ సైడ్‏లో ఆమెను బైక్ ఢీకొట్టింది. ఆమె జూలియార్డ్ స్కూల్‏ను సందర్శించే మార్గంలో అమ్స్టర్డామ్ అవెన్యూని దాటుతుండగా..ఆమెకు ప్రమాదం జరిగింది. బైక్‌పై వచ్చిన వ్యక్తి అతి వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రమాదం తర్వాత బైకుని ఆపకుండా వెళ్లిపోయాడని లాసా మేనేజర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అయితే బాధితుడి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే ఘటన జరిగి రెండు రోజులు అయినా కానీ ఇంకా ఆ బైకర్ ను అరెస్ట్ చేయలేదు పోలీసులు. గాన్ గర్ల్ సినిమా ద్వారా ఆమె గుర్తింపు పొందింది.   ఆమె నాష్విల్లె, మేడమ్ సెక్రటరీ వంటి  టెలివిజన్ షోలలో కూడా పాల్గోంది.

Also Read: Anandaiah Letter to AP CM Jagan: మందు తయారీ, పంపిణీకి సహకరించండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆనందయ్య లేఖ!

AR Rahmans: వ్యాక్సిన్ వేయించుకున్న ఏఆర్ రెహమాన్.. కానీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న అతని మాస్క్.. ఇంతకీ స్పెషల్ ఏంటో తెలుసా..

Capsicum Benefits: క్యాప్సికమ్‏తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ ఇదే..

Blood Scarcity: దేశంలో రక్తం కొరత రాబోతుందా?.. బ్లడ్ బ్యాంకుల్లో అడుగంటుతున్న రక్త నిలువలు.. పొంచి ఉన్న ప్రమాదం!