Jr.NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైమ్.. తారక్‏తో సినిమా చేసేందుకు రెడీ అంటున్న హాలీవుడ్ డైరెక్టర్..

ఇక ఇటీవల ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన ఏడాది దాటినా ట్రిపుల్ ఆర్ మేనియా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ మన స్టార్ హీరోస్ యాక్టింగ్ పై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 సినిమా డైరెక్టర్ జేమ్స్ గన్ తారక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Jr.NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైమ్.. తారక్‏తో సినిమా చేసేందుకు రెడీ అంటున్న హాలీవుడ్ డైరెక్టర్..
Ntr, Director James Gunn

Updated on: Apr 26, 2023 | 1:15 PM

అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసిందీ మూవీ. టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వీరిద్దరి గ్లోబల్ లెవల్లో గుర్తింపు వచ్చింది. ఇక ఇటీవల ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన ఏడాది దాటినా ట్రిపుల్ ఆర్ మేనియా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ మన స్టార్ హీరోస్ యాక్టింగ్ పై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 సినిమా డైరెక్టర్ జేమ్స్ గన్ తారక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ జేమ్స్ గన్ రూపొందించిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని మే5 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల డైరెక్టర్ జేమ్స్ గన్ మాట్లాడుతూ… ట్రిపుల్ ఆర్ సినిమాతోపాటు.. ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జేమ్స్ గన్ ను ఉద్దేశిస్తూ.. గార్డియన్స్ ప్రపంచంలోకి ఒక భారతీయ నటుడిని పరిచయం చేయాలనుకుంటే ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తారని ప్రశ్నించగా.. జేమ్స్ మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ చిత్రంలో బోను నుంచి పులలతోపాటు.. జంప్ చేసిన వ్యక్తితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం అలాగే అతను ఎంతో ప్రశాంతంగా కనిపించాడు” అని పేర్కొన్నాడు.

జేమ్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో తారక్ ఫ్యాన్స్ సంతోషం వయ్క్తం చేస్తున్నారు. గతంలో తారక్ మాట్లాడుతూ.. తనకు హాలీవుడ్ నుంచి ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని.. తనకు మార్వెల్ సినిమాలో నటించాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.