ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్

ప్రభాస్ అభిమానులందరి చూపు ఇప్పుడు సాహో సినిమాపైనే ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ మూవీ నిర్మితమవుతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. హాలీవుడ్ స్టంట్ కొరియాగ్రాఫర్ కెన్నీ బేట్స్ మాట్లాడుతూ.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ప్రభాస్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. సాధారణంగా చాలా మంది హీరోలు హై రిస్క్ ఉండే యాక్టన్ సీన్స్ చేసిన తరువాత అలసిపోతూంటారు. అలాంటిదేమీ ప్రభాస్‌లో కనిపించలేదు. ఉదయం ప్రభాస్ సెట్స్‌కి వచ్చినప్పుడు ఎంత […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:02 pm, Sat, 16 March 19
ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్

ప్రభాస్ అభిమానులందరి చూపు ఇప్పుడు సాహో సినిమాపైనే ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ మూవీ నిర్మితమవుతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. హాలీవుడ్ స్టంట్ కొరియాగ్రాఫర్ కెన్నీ బేట్స్ మాట్లాడుతూ.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ప్రభాస్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. సాధారణంగా చాలా మంది హీరోలు హై రిస్క్ ఉండే యాక్టన్ సీన్స్ చేసిన తరువాత అలసిపోతూంటారు. అలాంటిదేమీ ప్రభాస్‌లో కనిపించలేదు. ఉదయం ప్రభాస్ సెట్స్‌కి వచ్చినప్పుడు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో.. సాయంత్రం సెట్స్ నుంచి వెళ్లేటప్పుడుకూడా అలానే ఉంటాడని అన్నాడు కెన్నీ బేట్స్. యాక్షన్ సీన్స్‌లో ఏ మాత్రం బెదురు లేకుండా యాక్ట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. కాగా.. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం తెలిపారు.