Jigarthanda Remake: ‘జిగర్తాండ’ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన సినీ యూనిట్.. హీరోగా ఆ స్టార్ ..

తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్,

Jigarthanda Remake: 'జిగర్తాండ' సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన సినీ యూనిట్.. హీరోగా ఆ స్టార్ ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2021 | 9:01 PM

తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్ పేరుతో తెరకెక్కింది. హరీశ్ శంకర్ దీనిని రీమెక్ చేయగా.. టాలీవుడ్‏లో కూడా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాను హిందీలో ‘బచ్చన్ పాండే’ పేరుతో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో హీరోగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాల ఈ సినిమాను నిర్మిస్తుండగా.. బుధవారం రాజస్థాన్‏లోని జైసల్మీర్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. సాజిత్ కుమారులు సుబాన్, సుఫియన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. గతంలో ఈ మూవీలో తమన్నా హీరోయిన్‏గా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కృతి సనన్‏ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. హీరో కావాలనే కలలు కనే రౌడీగా అక్షయ్ నటించనుండగా.. జర్నలిస్ట్ పాత్రలో కృతి కనిపించనుందట. ఫర్హద్ సమ్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాడేజ్ కీలక పాత్రలో నటించనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: తొమ్మిదేళ్ల తర్వాత అక్కడ విడుదల కానున్న నాగ్ సినిమా.. క్రిస్మస్ కానుకగా విడుదలవుతోన్న చిత్రం.

చిరంజీవి లూసిఫర్’ రీమేక్‌ అప్‌డేట్‌.. దర్శకుడు కన్ఫర్మ్.. సంక్రాంతి నుంచి సెట్స్‌పైకి..