AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Movies : తెలుగు సినీ చరిత్రను తిరగరాసి థియేటర్స్‌లో 1000 రోజులకు పైగా ఆడిన సినిమాలు ఏమిటో తెలుసా..!

గత కొన్నేళ్ల క్రితం వరకూ సినిమా హిట్ అంటే 100 రోజులు ఆడుతుంది అని భావించే వారు. తమ హీరో సినిమా శతదినోత్సవం జరుపుకుంది అని గర్వవంగా చెప్పేవారు.. అయితే ఇప్పుడు హిట్ అంటే కలెక్షన్లు వసూలు..

Tollywood Movies : తెలుగు సినీ చరిత్రను తిరగరాసి థియేటర్స్‌లో 1000 రోజులకు పైగా ఆడిన సినిమాలు ఏమిటో తెలుసా..!
1000 days movies in telugu
Surya Kala
|

Updated on: Mar 01, 2021 | 5:51 PM

Share

Tollywood Movies : ఇప్పుడంటే ప్రజలకు వినోదాన్ని అందించడానికి టీవీ, ఫేస్ బుక్, యూట్యూబ్, వంటి అనేక సాధనాలు వచ్చాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలకు వినోదాన్ని అందించేది సినిమా మాత్రమే.. పండగలు, ఫంక్షన్లు వచ్చినా.. తమ కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లాలని భావించినా అందరి దొరికే మొదటి ఆప్షన్. సినిమా.. అందరి కలిసి సంతోషంగా థియేటర్ కు వెళ్లి సినిమా చేసేవారు. ఇక సినిమా చూసిన తర్వాత అందులోని పాత్రల తీరు తెన్నులను విశ్లేషిస్తూ.. హీరో హీరోయిన్ల గురించి చర్చించేవారు. తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే మొదటి షో చూడటానికి చాలా ఎదురుచూస్తూ ఉంటారు.

ఇప్పుడు సినిమాలు చూడడానికి థియేటర్స్ కు వెళ్లాల్సిన పనిలేదు.. టీవీలు సెల్ ఫోన్లు సోషల్ మీడియా Ott వంటివి అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు సినిమా చూడాలి అంటే తప్పనిసరిగా థియేటర్ కి వెళ్లాల్సిందే. గత కొన్నేళ్ల క్రితం వరకూ సినిమా హిట్ అంటే 100 రోజులు ఆడుతుంది అని భావించే వారు. తమ హీరో సినిమా శతదినోత్సవం జరుపుకుంది అని గర్వవంగా చెప్పేవారు.. అయితే ఇప్పుడు హిట్ అంటే కలెక్షన్లు వసూలు అని భావిస్తున్నారు. అయితే తెలుగు సినిమా పుట్టిన తర్వాత థియేటర్స్ లో 1000 రోజులకు పైగా ఆడిన సినిమాల గురించి తెలుసుకుందాం..

1963లో వచ్చిన లవకుశ సినిమా 1111 రోజులు ఆడింది. 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. లవకుశ. ఈ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. సీతారాములు పట్టాభిషిక్తులు అయ్యాకా చాకలి తిప్పడు నిందవేశాడని రాజారాముడు గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణ గానం చేయడం, రామ అశ్వమేథయాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి. 1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమా అపూర్వమైన వాణిజ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్నికేంద్రాల్లో 150 రోజులు జరుపుకోవడంతో మొదలైన రికార్డ్ పరంపర అనేవిషయాల్లో చరిత్ర సృష్టించింది. పావలా, రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో సినిమా రూ.కోటి వసూళ్ళు సాధించింది. 60లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్మి చరిత్ర సృష్టించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం మగధీర. రెండు జన్మల నేపథ్యంలో సాగిన ఈ సినిమా 2009లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా 1001 రోజులు ఆడిందిటాలీవుడ్ లో అనేక రికార్డులను తిరగరాసింది. తెలుగు సినిమా కూడా వంద కోట్ల కలెక్షన్లను వసూలు చేయగలదు అని సినీ ప్రపంచానికి చాటి చెప్పింది. అప్పటి వరకూ తెలుగు సినిమాల్లో మగధీర ప్రత్యేకం అనిపించింది. ఏ సినిమా తిరగరాయలేని ఎన్నో రికార్డ్స్ ను అప్పట్లో మగధీర సృష్టించింది. రామ్ చరణ్ రెండో సినిమాతోనే స్టార్ హీరో అయిపోయాడు.ఇప్ప‌టికీ కూడా మ‌గ‌ధీర సృష్టించిన కొన్ని రికార్డులు అలాగే ప‌దిలంగా ఉన్నాయి. బాహుబ‌లి సైతం వాటిని ట‌చ్ చేయలేక‌పోయింది. అప్ప‌ట్లో ఉన్న త‌క్కువ టికెట్ రేట్ల‌తోనే అద్భుతాలెన్నో చేసాడు మ‌గ‌ధీరుడు.

మహేష్ బాబు , పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి సినిమా ఘన విజయం సొంతం చేసుకుంది. 2006లో విడుదలైన పోకిరి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా 1000 రోజులకు పైగా ఆడింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైన 75 సంవత్సరంలో విడుదలైంది. కలెక్షన్లు రూ.40 కోట్లు దాటడం 75ఏళ్ళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డుగా నిలిచింది. మగధీర చిత్రం విడుదలవరకు ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. సినిమా చిత్రీకరణ 70 రోజుల్లో పూర్తి కావడం విశేషం

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా లెజెండ్. 2014 లో రిలీజై బాలయ్య స్టామినాను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. లెజెండ్ సినిమా 1005 రోజులు ఆడింది. వీరిద్దరి కాంబినేషన్ లో రిలీజైన మొదటి సినిమా సింహా ఎంత హిట్ గా నిలిచిందో.. తర్వాత వచ్చిన లెజెండ్ కూడా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్స్ ను సృష్టించింది. ఈ సినిమాతోనే హీరో జగపతిబాబు విలన్ గా మారాడు. సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ తో ప్రారంభించాడు.

Also Read:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో, ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న సినిమా ఫోటోలు….

వీరుడి జీవిత కథలో నటించనున్న రాజకీయ నాయకుడు. ఇంతకీ ఎవరా నేత..? ఏంటా సినిమా.? ఏంటా కథ..?