Mammootty: ‘క్షమించండి.. ఇంకోసారి అలా మాట్లాడను’.. ఆ వివాదంపై సూపర్ స్టార్ మమ్ముట్టి కామెంట్స్..

|

Dec 15, 2022 | 3:12 PM

ఆయన మాటలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో.. చివరకు తన ఫేస్ బుక్ వేదికగా వివరణ ఇస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇకపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. ఇంతకీ ఏం జరిగింది ? మమ్ముట్టి వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్ కావడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

Mammootty: క్షమించండి.. ఇంకోసారి అలా మాట్లాడను.. ఆ వివాదంపై సూపర్ స్టార్ మమ్ముట్టి కామెంట్స్..
Mammootty
Follow us on

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల యంగ్ డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డారు. సదరు దర్శకుడిని మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేశారు నెటిజన్స్. ఆయన మాటలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో.. చివరకు తన ఫేస్ బుక్ వేదికగా వివరణ ఇస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇకపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. ఇంతకీ ఏం జరిగింది ? మమ్ముట్టి వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్ కావడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఇటీవల యంగ్ డైరెక్టర్ జోసెఫ్ తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం 2018 ట్రైలర్ ను మమ్ముట్టి లాంచ్ చేశార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోసెఫ్ తనపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు.. కానీ ఆయన చాలా తెలివైనవాడు అంటూ ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. కొందరు ఈ మాటలను తప్పుగా తీసుకున్నారు. జోసెఫ్ ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశరంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.ఈ క్రమంలోనే తాను జోసెఫ్ ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా బాధించాయని.. తన మాటలకు చింతిస్తున్నానని.. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొస్తూ.. తన ఫేస్ బుక్ వేదికగా ఓ నోట్ చేశారు మమ్ముట్టి.

ఇక మమ్ముట్టికి డైరెక్టర్ జోసెఫ్ కూడా మద్దతు తెలుపుతూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మమ్ముట్టి మాటలు.. తనను కానీ.. తన కుటుంబాన్ని కానీ ఏమాత్రం బాధపెట్టలేదని.. ఆయనను విమర్శించవద్దని రిక్వెస్ట్ చేశారు. తన హెయిర్ లాస్ పట్ల ఎవరైనా నిజంగా ఆందోళన చెందుతుంటే.. షాంపూ కంపెనీలు.. నీటిని సరఫరా చేస్తున్న బెంగుళూరు కార్పొరేషన్ కు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని సూచించారు. మొత్తానికి మమ్ముట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.