డిసెంబర్ 20న హీరో కార్తీ `దొంగ‌’ రిలీజ్..!

డిసెంబర్ 20న హీరో కార్తీ `దొంగ‌' రిలీజ్..!

తెలుగులో కూడా.. సూర్య, కార్తీలకు మంచి పేరుంది. తాజాగా.. కార్తీ నటించిన ఖైదీ సినిమా మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ సినిమాలో.. హీరో సూర్య భార్య.. కార్తీ వదిన.. జ్యోతిక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి జోసెష్ దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్ 18 స్టూడియోస్‌, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు. కాగా.. తాజాగా విడుదల […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Dec 02, 2019 | 8:20 PM

తెలుగులో కూడా.. సూర్య, కార్తీలకు మంచి పేరుంది. తాజాగా.. కార్తీ నటించిన ఖైదీ సినిమా మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ సినిమాలో.. హీరో సూర్య భార్య.. కార్తీ వదిన.. జ్యోతిక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి జోసెష్ దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్ 18 స్టూడియోస్‌, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు. కాగా.. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఈ పోస్టర్స్‌కి, టీజర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

దొంగ సినిమా నుంచి ఈ రోజు ‘రూపి రూపి’ అనే సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. గోవాలో కలర్‌ఫుల్‌గా ఈ సాంగ్‌ని పిక్చరైజ్ చేశారు. లాంగ్ హెయిర్‌తో.. సరికొత్త లుక్స్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు కార్తీ. అలాగే… ఎవ్వరినీ వదలదుగా నా స్ట్రీట్ స్మార్ట్ చిలిపితనం.. మాయలోన పుట్టి మాయలోన పెరిగినాను అంటూ సాగే ఈ పాటలో హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలిపారు. రామజోగయ్యశాస్త్రి ఈ పాటను రాయగా.. రంజింత్ గోవింద్ పాడారు. కాగా.. ఈ సినిమా డిసెంబర్ 20న అన్ని భాషల్లోనూ… ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu