Aadhi Pinisetty: పెళ్లిపీటలెక్కిన ప్రేమపక్షులు.. వేడుకగా ఆది, నిక్కీల వివాహం.. సందడి చేసిన టాలీవుడ్‌ హీరోలు..

Aadhi Pinisetty - Nikki Galrani: టాలీవుడ్ నుంచి నాని, సందీప్‌ కిషన్‌లు, ఆర్య తదితరులు ఆది- నిక్కీల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన హల్దీ వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు.

Aadhi Pinisetty: పెళ్లిపీటలెక్కిన ప్రేమపక్షులు.. వేడుకగా ఆది, నిక్కీల వివాహం.. సందడి చేసిన టాలీవుడ్‌ హీరోలు..
Aadhi And Nikki Garlani

Updated on: May 19, 2022 | 1:19 PM

Aadhi Pinisetty – Nikki Galrani: గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కోలీవుడ్‌ యంగ్ హీరో ఆది పినిశెట్టి, కన్నడ బ్యూటీ నిక్కీ గల్రాణి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌ వేదికగా వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా టాలీవుడ్ నుంచి నాని, సందీప్‌ కిషన్‌లు, ఆర్య తదితరులు ఆది- నిక్కీల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన హల్దీ వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగినప్పటికీ వివాహ విందును మాత్రం గ్రాండ్‌గానే ఏర్పాటు చేయనున్నారు ఆది దంపతులు. సినీ ఇండస్ట్రీ, ఇతర రంగాలకు చెందిన వారందరిని ఈ వెడ్డింగ్‌ డిన్నర్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

2015లో విడుదలైన యాగవరైనమ్‌ నా కక్కా అనే తమిళ సినిమాలో మొదటి సారిగా జంటగా నటించారు ఆది, నిక్కీ గల్రాణి. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో పాటు మనసులు కూడా కలిశాయి. అయితే తమ ప్రేమను మాత్రం రహస్యంగానే ఉంచారు. ఇక ఈ ఏడాది మార్చి 24న ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత పెళ్లి విషయంపై కూడా సస్పెన్స్‌ కొనసాగించారు. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఓ ప్రెస్‌మీట్‌ నిర్వహించి తమ పెళ్లి వేడుకల గురించి అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం, నిన్నుకోరి, సరైనోడు, అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు ఆది. ఇప్పుడు రామ్‌ పోతినేని హీరోగా నటిస్తోన్న వారియర్‌ సినిమాలోనూ విలన్‌గా కనిపించనున్నాడు. మరోవైపు నిక్కీ గల్రానీ కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తమిళ్, ఓ మలయాళీ సినిమా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

KRK OTT: ఓటీటీలో సేతుపతి, సామ్‌, నయన్‌ల సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Child Marriages: పుస్తకాలు పట్టుకునే వయసులోనే పుస్తెల తాడు.. బాల్య వివాహాల్లో ఏపీ టాప్‌.. తెలంగాణ ఏ స్థానంలో ఉందంటే..

IPL 2022: సారా, అనుష్క, ధనశ్రీ.. ఐపీఎల్‌లో అందాల భామల సందడి మాములుగా లేదుగా..