Paul Grant: సినీ పరిశ్రమలో మరో విషాదం.. నింగికెగిసిన మరో సినీ తార.. ప్రముఖ నటుడు కన్నుమూత
Actor Paul Grant Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘హ్యారీ పోటర్’ ఫేం పాల్ గ్రాంట్ కన్నుమూశారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘హ్యారీ పోటర్’ ఫేం పాల్ గ్రాంట్ కన్నుమూశారు. లండన్‌లోని రైల్వే స్టేషన్ వద్ద కుప్పకూలి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మార్చి 16వ తేదీన నార్త్ లండన్‌లోని కింగ్స్ క్రాస్ స్టేషన్ వెలుపల పాల్ గ్రాంట్ ఒక్కసారిగా తూలి పడిపోయాడు. అతన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాల్ గ్రాంట్‌ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాల్ గ్రాంట్ తుదిశ్వాస విడిచారు. పాల్ గ్రాంట్ మృతి వార్త తెలుసుకున్న పలువురు హాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. 1980లో సినీ రంగ ప్రవేశం చేసిన పాల్ గ్రాంట్ .. విల్లో, లైబరన్త్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హ్యారీ పోటర్, స్టార్ వార్స్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ సంపాదించుకున్నారు.
పీటర్ బరోకు చెందిన పాల్ గ్రాంట్ బ్రిటీష్ యాక్టర్. ఆయన వయసు 56 ఏళ్లు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి. ఈ పరిస్థితుల్లోనూ డ్రగ్, ఆల్కహాల్ తాగడం వ్యసనంగా మారిపోయిమంది. 2014లో కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయిపోయింది. బహుశా ఈ వ్యసనాలే అతడి చావుకి కారణమై ఉండొచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పాల్ అకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
NEW:
Paul Grant, who played an Ewok in Star Wars: Return of the Jedi and a goblin in Harry Potter and the Philosopher’s Stone, died after collapsing outside a London train station.
He was 56 years old. #diedsuddenly pic.twitter.com/NmjTkyhGrl
— DiedSuddenly (@DiedSuddenly_) March 20, 2023