Happy Birthday Kajal: ఆసక్తిగా విష్ణు, కాజల్‌ల ‘మోసగాళ్లు’ లుక్
మంచు విష్ణు, కాజల్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మోసగాళ్లు'. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
మంచు విష్ణు, కాజల్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మోసగాళ్లు’. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది. కాగా శుక్రవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సగం విష్ణు, సగం కాజల్ ఫేస్‌లతో వచ్చిన ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటుండగా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఇందులో విష్ణు అర్జున్, కాజల్ అను పాత్రలో నటిస్తున్నారు.
కాగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విష్ణు, కాజల్ కవలలుగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ నటుడు సుశీల్ శెట్టి సహా పలువురు హాలీవుడ్ నటులు భాగం అయ్యారు. ఇప్పటికే 80 శాతం పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వగా.. ఈ థ్రిల్లర్ కథాంశానికి నివాస్ సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: Breaking: వారంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం కానున్న బస్సులు
Thank you team #mossagallu @iVishnuManchu ??? pic.twitter.com/KGzckbwrA0
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 18, 2020