Shakunthalam Movie: ‘శాకుంతలం’ కోసం భారీ సెట్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. పనులను పరిశీలించిన గుణశేఖర్..

పౌరాణిక కథాంశంతో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించబోయే సినిమా 'శాకుంతలం'. గత కొంత కాలంగా ఈ సినిమా హీరోయిన్ ఎవరనేదానిపై అనేక వార్తలు వచ్చాయి.

Shakunthalam Movie: 'శాకుంతలం' కోసం భారీ సెట్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. పనులను పరిశీలించిన గుణశేఖర్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2021 | 3:37 PM

పౌరాణిక కథాంశంతో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించబోయే సినిమా ‘శాకుంతలం’. గత కొంత కాలంగా ఈ సినిమా హీరోయిన్ ఎవరనేదానిపై అనేక వార్తలు వచ్చాయి. ఇందులో ముందుగా పూజా హెగ్డే నటింనున్నట్లుగా రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు గుణశేఖర్. సాధరణంగా ఒక మాములు తీయడానికే గుణశేఖర్ వేసే సెట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన నిర్మించే చిత్రం పౌరాణిక ప్రేమ. ఇది మహాభారతలోని ఆదిపర్వంలోగల ఒక కథాంశం.

శాకుంతలం సినిమా కోసం భారీ సెట్ ప్లాన్ చేస్తున్నాడట గుణశేఖర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది శాకుంతలం. ఇందుకోసం భారీ సెట్ ప్లాన్ చేస్తుండగా.. దాదాపు ఎక్కువ శాతం అక్కడే షూటింగ్ జరిగేలా చూడనున్నట్లుగా తెలుస్తోంది. పౌరాణిక సినిమా కావడంతో అందుకు తగ్గుట్టుగా సెట్ ఉండేలాగా గుణశేఖర్ దగ్గరుండి మరీ పనులను పరిశీలిస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో దుష్యంతుడి పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: గుణశేఖర్ భారీ బడ్జెట్ సినిమా శాకుంతలంలో ఛాన్స్ దక్కించుకున్న ప్రభాస్ హీరోయిన్..?

Acharya Movie: సినిమా కోసం అతి పెద్ద టెంపుల్ సెట్.. ‘ఆచార్య’ సెట్ వీడియో షేర్ చేసిన చిరంజీవి..