దివ్యాంగుల కోసం ఉపాసన మంచి పనికి చెర్రీ సహకారం

రామ్ చరణ్‌ భార్య, అపోలో లైఫ్ వైస్ ఛైర్మన్‌ ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌వుమెన్‌గా

దివ్యాంగుల కోసం ఉపాసన మంచి పనికి చెర్రీ సహకారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 06, 2020 | 1:56 PM

Upasana Special Program: రామ్ చరణ్‌ భార్య, అపోలో లైఫ్ వైస్ ఛైర్మన్‌ ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌వుమెన్‌గా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఉపాసన యువర్ లైఫ్ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశారు. అందులో శరీరం, మెదడు, చికిత్స, పోషకాహారం అనే నాలుగు అంశాలకు సంబంధించిన అంశాలను ఆమె నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఉపాసన కార్యక్రమంలో ఇటీవల భాగమైన సమంత.. ఆమెతో కలిసి ఫిట్‌నెస్‌, పోషకాహారంకు సంబంధించిన వీడియోలను షేర్ చేసుకున్నారు.

ఇక ఈ వెబ్‌సైట్‌లోనే ఇప్పుడు మనం ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్‌తో లోకల్‌ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం ఉపాసన చేస్తున్నారు. అందులో భాగంగా దివ్యాంగుల డ్యాన్స్ టాలెంట్‌ని తెలిపేందుకు హీల్‌ యువర్ లైఫ్‌ త్రూ డ్యాన్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఉపాసన. ఇక ఈ టాలెంట్‌ షోకు రామ్ చరణ్ ఒక జడ్జ్‌గా వ్యవహరించబోతుండటం గమనార్హం. ఆన్‌లైన్‌లో జరగబోతున్న ఈ షోకు చెర్రీ మాత్రమే కాదు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, టాప్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కూడా భాగం అవుతున్నారు. ఈ ముగ్గురు ఈ షో కోసం జడ్జ్‌లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా దివ్యాంగుల కోసం ఓ మంచి కార్యాన్ని చేపట్టబోతున్న ఉపాసనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Read More:

‘వకీల్‌ సాబ్’‌ కోసం 20 రోజులు ఇచ్చిన పవన్‌..!

అవేవీ పట్టించుకోని రాజమౌళి.. పెద్ద సాహసమే చేస్తున్నాడా..!