ఓటీటీలో నయనతార భక్తిరస ప్రధాన చిత్రం

ఈ నెల పదిహేను నుంచి థియేటర్లు తెరచుకోబోతున్నాయి.. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు ఆరు నెలల నుంచి థియేటర్లలో సినిమాలకు నోచుకోలేకపోయిన ప్రేక్షకులకు ఇది శుభవార్తే కానీ.. నిర్మాతలు మాత్రం తన సినిమాలను విడుదల

ఓటీటీలో నయనతార భక్తిరస ప్రధాన చిత్రం
Follow us

|

Updated on: Oct 06, 2020 | 1:04 PM

ఈ నెల పదిహేను నుంచి థియేటర్లు తెరచుకోబోతున్నాయి.. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు ఆరు నెలల నుంచి థియేటర్లలో సినిమాలకు నోచుకోలేకపోయిన ప్రేక్షకులకు ఇది శుభవార్తే కానీ.. నిర్మాతలు మాత్రం తన సినిమాలను విడుదల చేయడానికి ఇంకా ఎందుకో సందేహిస్తున్నారు.. 50 శాతం ప్రేక్షకులతో వర్క్‌ అవుట్‌ అవుతుందా అన్న అనుమానం నిర్మాతలకు కలుగుతోంది.. అందుకే చాలా మంది ఓటీటీలను నమ్ముకుని తమ సినిమాలను వాటికి అమ్ముకుంటున్నారు.. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ద్వారా విడుదలవుతున్నాయి.. అగ్ర కథానాయకి నయనతార నటించిన మూకుత్తి అమ్మన్‌ అనే ఓ తమిళ సినిమా కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. భక్తిరస ప్రధానమైన ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించబోతున్నారు.. కేఆర్‌ విజయ తర్వాత అమ్మవారి పాత్రలో నయనతార గొప్పగా నటించారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.. శ్రీరామరాజ్యంలో సీతగా నటించిన నయనతారకు ఈ పాత్ర కూడా ఛాలెంజింగ్‌ రోలే! ఇక ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. నటుడు ఆర్‌.జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి మే 1న రిలీజ్‌ కావాలి.. కాకపోతే ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా విడుదల వాయిదా పడింది.. దీపావళి పండుగను పురస్కరించుకుని ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..