డ్రగ్స్ కేసు.. నిర్మాత భార్య అరెస్ట్
బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. సుశాంత్ కేసులో ఈ కోణం బయటపడగా.. రంగంలోకి దిగిన ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Bollywood Producer wife arrested: బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. సుశాంత్ కేసులో ఈ కోణం బయటపడగా.. రంగంలోకి దిగిన ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పలువురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు.. తాజాగా బాలీవుడ్ సినీ నిర్మాత ఫిరోజ్ నదియాడ్‌వాలా భార్య షబానా సయీద్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ధ్రువీకరించారు. ( Bigg Boss 4: ఏం చేసుకోనని ప్రామిస్ చెయ్యి.. అవినాష్‌ని రిక్వెస్ట్ చేసిన అరియానా)
షబానాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. కాగా షబానా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో సబర్బన్ జూహూలోని షబానా నివాసంలో సోదాలు నిర్వహించగా.. 10 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో ఆమెను విచారణకు పిలిచిన ఎన్సీబీ అరెస్టు చేసింది. ఇక ఇదే కేసులో ఫిరోజ్‌ను సైతం ఎన్సీబీ అధికారులు విచారణకు పిలిచారు. ( Bigg Boss 4: అవన్నీ గుర్తొచ్చాయి సర్ అంటూ హ్యాండ్ ఇచ్చిన సుమ)