AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: ఆరోగ్యం కోసమని తెల్ల ఉప్పును వదిలేస్తున్నారా?.. కనుమరుగైన ఆ వ్యాధి మళ్లీ వస్తోంది..

ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిన చాలామంది.. మనం రోజూ వాడే తెల్లటి అయోడైజ్డ్ ఉప్పుకు బదులుగా 'పింక్ సాల్ట్' (హిమాలయన్ సాల్ట్) లేదా సముద్రపు ఉప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ మార్పు ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దేశంలో పూర్తిగా కనుమరుగైన 'అయోడిన్ లోపం' మళ్ళీ తిరిగి వస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Health Alert: ఆరోగ్యం కోసమని తెల్ల ఉప్పును వదిలేస్తున్నారా?.. కనుమరుగైన  ఆ వ్యాధి మళ్లీ వస్తోంది..
Iodine Deficiency Symptoms
Bhavani
|

Updated on: Feb 13, 2026 | 9:28 PM

Share

శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ చాలా అవసరం. పింక్ సాల్ట్ సముద్రపు ఉప్పులో ఖనిజాలు ఉన్నప్పటికీ, మన శరీరానికి కావాల్సిన ‘అయోడిన్’ మాత్రం ఉండదు. డాక్టర్ అలీ కజేమి వంటి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అసలు అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? పింక్ సాల్ట్ వాడే వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అయోడిన్ లోపం – గండంలో థైరాయిడ్!

మాయో క్లినిక్ నివేదిక ప్రకారం, ఒక వయోజనుడికి రోజుకు కనీసం 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. మనం రోజూ తీసుకునే అర టీస్పూన్ అయోడైజ్డ్ ఉప్పు ద్వారా ఈ అవసరాన్ని తీర్చుకోవచ్చు. కానీ, అయోడిన్ లేని పింక్ సాల్ట్ లేదా సముద్రపు ఉప్పు వాడటం వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు) వంటి సమస్యలు తలెత్తుతాయి.

గర్భిణీలు పిల్లలపై ప్రభావం

అయోడిన్ లోపం కేవలం పెద్దలకే కాదు, పుట్టబోయే బిడ్డలకు కూడా ప్రమాదకరం.

మెదడు అభివృద్ధి: పిండం యొక్క మెదడు సక్రమంగా ఎదగడానికి అయోడిన్ చాలా ముఖ్యం. దీని లోపం వల్ల పుట్టబోయే పిల్లల్లో మానసిక వైకల్యం వచ్చే అవకాశం ఉంది.

శారీరక పెరుగుదల: పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధిలో అయోడైజ్డ్ ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది.

హైపోథైరాయిడిజం: రక్తంలో అయోడిన్ తగ్గడం వల్ల వచ్చే హైపోథైరాయిడిజం లక్షణాలను అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే అరికట్టగలదు.

పింక్ సాల్ట్ ఎందుకు సరిపోదు?

పింక్ సాల్ట్ సహజ ఖనిజ శిలల నుండి తయారవుతుంది. ఇందులో ఇనుము వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది గులాబీ రంగులో కనిపిస్తుంది కానీ, ఇందులో సహజంగా అయోడిన్ ఉండదు. అలాగే సముద్రపు నీటి నుండి తయారయ్యే ‘సీ సాల్ట్’లో కూడా అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే తెల్లటి ఉప్పును శుద్ధి చేసేటప్పుడు దానికి అదనంగా అయోడిన్ కలుపుతారు (Fortification). అదే మనం వాడే అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్.

వైద్యుల సూచన

ఒకవేళ మీరు పింక్ సాల్ట్ వాడాలనుకుంటే, అయోడిన్ అందేలా చేపలు, పాలు, పెరుగు మరియు సముద్రపు పాచి వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కానీ అన్నిటికంటే సులభమైన చౌకైన మార్గం ‘అయోడైజ్డ్ ఉప్పు’ను వాడటమేనని డబ్ల్యూహెచ్‌ఓ (WHO) తో సహా ప్రముఖ ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా కొత్త డైట్ అనుసరించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

Follow Us