Bigg Boss 4: ఏం చేసుకోనని ప్రామిస్ చెయ్యి.. అవినాష్‌ని రిక్వెస్ట్ చేసిన అరియానా
ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో అందరూ సేఫ్ అవుతూ రాగా.. చివరగా అమ్మ రాజశేఖర్, మెహబూబ్ మిగిలారు. వారిద్దరినీ గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు బూత్‌లలోకి వెళ్లాలని
Avinash Ariyana Bigg Boss 4: ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో అందరూ సేఫ్ అవుతూ రాగా.. చివరగా అమ్మ రాజశేఖర్, మెహబూబ్ మిగిలారు. వారిద్దరినీ గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు బూత్‌లలోకి వెళ్లాలని నాగార్జున చెప్పారు. అందులో ఒకరు ఎలిమినేట్ అవుతారని, మరొకరు బ్యాక్ వస్తారని నాగార్జున తెలిపారు. అయితే తన ఎలిమినేషన్‌పై కాన్ఫిడెన్స్‌తో ఉన్న అమ్మ.. నేను వెళ్లిపోతా, అవినాష్ వస్తాడంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అవినాష్ గురించి అరియానా ఎమోషన్ అయ్యింది. ( Bigg Boss 4: అవన్నీ గుర్తొచ్చాయి సర్ అంటూ హ్యాండ్ ఇచ్చిన సుమ)
అతడి దగ్గరకు వెళ్లి.. ఒక వేళ అటూ ఇటూ అయితే నా కోసం వెయిట్ చేయ్. నేను రాగానే నిన్ను కలుస్తా. నీ ప్రాబ్లమ్స్ గురించి ఏమీ ఆలోచించకు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు ప్లీజ్. మమ్మీ మీద ప్రామిస్ చేయి. నీ కాళ్లు పట్టుకుంటా. ఏం చేసుకోకు ప్లీజ్. నువ్వు బతికుండు చాలు ప్లీజ్.. ప్లీజ్ అంటూ చాలా ఏడ్చేసింది. ఇక అవినాష్, మాస్టర్ ఇద్దరూ లోపలికి వెళ్లగా.. అందులో ఒకరు ఎలిమినేట్ అయ్యారని.. ఎవరో డోర్ ఓపెన్ చేసి చూడాలని నాగార్జున అన్నారు. దీంతో వెంటనే హౌజ్‌లోని సభ్యులు రెండు డోర్లు తెరవగా.. ఇద్దరూ కనిపించలేదు. వెంటనే నాగార్జున ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అన్నారు. దీంతో అరియానా మరింత షాక్‌కి గురైంది. ( Bigg Boss 4: అమ్మ రాజశేఖర్ ఎలిమినేటెడ్.. కెప్టెన్సీ మెహబూబ్‌కి ఇచ్చేసిన మాస్టర్
ఇక చివరకు సింగిల్ ఎలిమినేషన్ అని తేలింది. అవినాష్ స్టోర్ రూమ్‌లో కనిపించాడు. దీంతో అవినాష్ సేఫ్ అయ్యాడు అని నాగార్జున కనిపించారు. ఇక బయటకు వచ్చిన అవినాష్ భోరున ఏడ్చేశాడు. గుండె ఆగినంత పనైంది. మళ్లీ జీరోకు వచ్చా. బిగ్‌బాస్ వలనే నాకు మళ్లీ లైఫ్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ( జమ్ములో ఉగ్రవాదులకు బలైపోయిన నిజామాబాద్‌జిల్లా జవాను)