Bigg Boss 4: అమ్మ రాజశేఖర్ ఎలిమినేటెడ్.. కెప్టెన్సీ మెహబూబ్‌కి ఇచ్చేసిన మాస్టర్
బిగ్‌బాస్ 4లో తొమ్మిదో వారానికి గానూ ఎలిమినేషన్ జరిగింది. అందరూ ఊహించినట్లుగానే అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.
Amma Rajasekhar eliminated: బిగ్‌బాస్ 4లో తొమ్మిదో వారానికి గానూ ఎలిమినేషన్ జరిగింది. అందరూ ఊహించినట్లుగానే అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత అమ్మ స్టేజ్‌పైకి రాగా.. మాస్టర్ బిగ్‌బాస్ జర్నీని నాగార్జున చూపించారు. ఆ తరువాత నకిలీ-అసలు అనే టాస్క్‌ని అమ్మ చేత ఆడించారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో ఎవరు నకిలీ-అసలు అన్నది ఎవరో చెప్పాలని అన్నారు. దీంతో అభి, అఖిల్, హారిక నకిలీ అని మాస్టర్ తేల్చేశారు. కానీ వారిలో మరీ ఎక్కువ లోపాలను చూపలేదు. వీరంతా బాగా ఆడుతారని, కానీ వాళ్ల లోపల ఒక చిన్న నల్ల మచ్చ ఉందని, దాన్ని చెరిపేసుకుంటే బావుంటుందని తెలిపారు. ఇక వెళ్తూ వెళ్తూ తన కెప్టెన్సీని మెహబూబ్‌కి అప్పగించారు. ఈ సందర్బంగా మెహబూబ్ తాత్కాలిక కెప్టెన్ మాత్రమేనని నాగార్జున గుర్తు చేశారు.
Read More:
మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..!