ఏకాకిగా మారిన మోనల్‌ను వీక్షకులు అక్కున చేర్చుకుంటారా..?

బిగ్ బిస్ సీజన్ 4 కు వీక్షకులను పెంచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు.  మొదట్లో ఎపిసోడ్లకు మంచి రేటింగ్ వచ్చినా..దేవీ నాగవల్లి, కుమార్ సాయి వంటి కంటెస్టెంట్ల ఎలిమినేషన్స్ విషయంలో  వీక్షకులు తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు.

ఏకాకిగా మారిన మోనల్‌ను వీక్షకులు అక్కున చేర్చుకుంటారా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 09, 2020 | 7:21 PM

బిగ్ బిస్ సీజన్ 4 కు వీక్షకులను పెంచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు.  మొదట్లో ఎపిసోడ్లకు మంచి రేటింగ్ వచ్చినా..దేవీ నాగవల్లి, కుమార్ సాయి వంటి కంటెస్టెంట్ల ఎలిమినేషన్స్ విషయంలో  వీక్షకులు తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది యాజమాన్యం. పండుగ స్పెషల్‌గా యాంకర్ సుమను తీసుకొచ్చి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఎపిసోడ్ మంచి హిట్టయ్యింది కూడా. ఇక పోతే హౌస్‌లో పరిణామాలు రోజురోజుకు మారిపోయాయి. సండే రోజు హౌస్ మేట్స్ తోటివాళ్లకు పంపిన గిఫ్ట్స్ అందజేశారు నాగార్జున. అయితే అందరికీ బహుమతుల వచ్చాయి కానీ అమ్మ రాజశేఖర్‌కు, మోనల్‌కు మాత్రం రాలేదు. దీంతో నాగార్జున ఎవరో ఇచ్చేది ఏంటి నేను ఇస్తున్నానంటూ వారికి గిఫ్ట్స్ పంపించారు. ఇక అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. దీంతో మోనల్ ఒంటిరిగా మిగిలిపోయింది. నిజంగా నిన్న తనకు ఎవరూ గిఫ్ట్ ఎవరూ పంపలేదని చెప్పినప్పుడు మోనల్ ఫేస్ చూసి జాలేసింది. అయితే అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ ఇంట్లో ఏకాకిగా మారినవాళ్లని వీక్షకులు ఓన్ చేసుకుంటారు. మేమున్నామంటూ ఓట్లు గుద్దేస్తారు. కౌశల్ దగ్గర్నుంచి, రాహుల్ సిప్లిగంజ్, తాజాగా కుమార్ సాయి వరకు ఈ విషయం నిరూపితమైంది. ఇప్పటివరకు మోనల్‌పై వ్యతిరేకత చూపించిన తెలుగు వీక్షకులు..ఆమెపై సానుభూతి ప్రదర్శించి అక్కున చేర్చుకుంటారో, లేదో చూడాలి.

Also Read :

మారేడిమిల్లి చేరుకున్న బన్నీ, రేపట్నుంచి షూటింగ్ షురూ

వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం

సామాన్యులకు చిక్కనంటోన్న ఉల్లి